దానిమ్మ టీ!

ABN , First Publish Date - 2020-09-13T05:30:00+05:30 IST

బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ, లెమన్‌ టీ... ఇలా రకరకాల టీ రుచులను టేస్ట్‌ చేసి ఉంటారు. కానీ ఎప్పుడైనా దానిమ్మ టీ రుచి చూశారా? దానిమ్మ టీ తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు చేకూరుతాయి.

దానిమ్మ టీ!

బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ, లెమన్‌ టీ... ఇలా రకరకాల టీ రుచులను టేస్ట్‌ చేసి ఉంటారు. కానీ ఎప్పుడైనా దానిమ్మ టీ రుచి చూశారా? దానిమ్మ టీ తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు చేకూరుతాయి.


దానిమ్మ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఆక్సిడేషన్‌ వల్ల చర్మకణాలు దెబ్బతినడాన్ని ఈ యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.


బరువు తగ్గడానికి దానిమ్మ టీ ఉపకరిస్తుంది. గుండె సంబంధ సమస్యలను దూరం చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా సహాయపడుతుంది. 


రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను పెంచుతుంది. రక్తంలో క్లాట్స్‌ ఏర్పడాన్ని నిరోధిస్తుంది. 


ఫ్రూట్‌ టీలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలుంటాయి. ఇవి నోటిలో ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. జింజివైటిస్‌, పెరియాండైటిస్‌ వంటి సమస్యలు దరిచేరకుండా చూస్తుంది.


కావలసినవి 

దానిమ్మ గింజలు రెండు కప్పులు ఠి అర కప్పు పంచదార


తయారీ

ఒక చిన్న బౌల్‌లో దానిమ్మగింజలు తీసుకుని, పప్పు రుబ్బే కర్రతో గింజలలో నుంచి జ్యూస్‌ బయటకు వచ్చేలా క్రష్‌ చేయాలి.

తరువాత పంచదార కలుపుకొని ఒక జార్‌లోకి తీసుకోవాలి. ఇది ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నెల రోజులు నిలువ ఉంటుంది.

టీ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక కప్పులో ఒక స్పూన్‌ దానిమ్మగింజలు, కొద్దిగా సూప్‌ తీసుకోవాలి.

అందులో వేడి నీళ్లను పోసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-09-13T05:30:00+05:30 IST