పాల్‌రెడ్‌ టెక్‌లో

ABN , First Publish Date - 2022-01-20T06:17:01+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన పాల్‌రెడ్‌ టెక్నాలజీ్‌సలో బ్లాక్‌స్టోన్‌ ఇండియా మాజీ సహ అధిపతి మాథ్యూ కిరియక్‌ 20 శాతం వాటా తీసుకోనున్నారు.

పాల్‌రెడ్‌ టెక్‌లో

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన పాల్‌రెడ్‌ టెక్నాలజీ్‌సలో బ్లాక్‌స్టోన్‌ ఇండియా మాజీ సహ అధిపతి మాథ్యూ కిరియక్‌ 20 శాతం వాటా తీసుకోనున్నారు. ఇందుకు రూ.32 కోట్లు చెల్లించనున్నారు. ఒక్కొక్కటి రూ.128 ధరతో 25 లక్షల కన్వర్టబుల్‌ వారెంట్లను జారీ చేయడానికి పాల్‌రెడ్‌ టెక్నాలజీస్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ విధంగా లభించిన నిధులను మూలధనం, ఇతర వ్యాపార వ్యయాలకు వినియోగిస్తారు. వారెంట్‌  జారీ ధరలో 25 శా తం ముందుగా లభిస్తుంది. గరిష్ఠంగా తొమ్మిది నెలల్లో మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి. వారెంట్లను రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుగా మారుస్తారు. 2017లో మాథ్యూ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ ఫ్లోరిన్‌ట్రీ అడ్వైజర్స్‌ పాల్‌రెడ్‌ టెక్నాలజీ్‌సలో రూ.22 కోట్ల పెట్టుబడి పెట్టి ఆ తర్వాత వెనక్కి తీసుకుంది. వెటరన్‌ ఇన్వెస్టర్‌ క్రిసిస్‌ క్యాపిటల్‌ వ్యవస్థాపకుడు ఆశిష్‌ ధావన్‌కు కంపెనీలో 7 శాతం వాటా ఉంది.   

Updated Date - 2022-01-20T06:17:01+05:30 IST