Abn logo
Sep 25 2020 @ 06:06AM

27న పాలీసెట్‌కు అన్ని ఏర్పాట్లు

- జిల్లాలో 15,755 మంది విద్యార్థులు

- ఐదు డివిజన్లలో  56 పరీక్షా కేంద్రాలు

- సరికొత్తగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

- 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి

 

కంచరపాలెం, సెప్టెంబర్‌ 24: పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పాలిసెట్‌-2020)కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు  ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌, జిల్లా పాలిసెట్‌ కో ఆర్డినేటర్‌ రాజాన భాస్కరరావు తెలిపారు. ఈనెల 27వ తేదీన జరిగే పరీక్షకు జిల్లాలోని ఐదు డివిజన్‌లలో 56 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 15,755 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. పరీక్షార్థులంతా వెబ్‌సైట్‌ నుంచి కొత్తగా అందుబాటులో ఉంచిన హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుందని, విద్యార్థులు తమకు కేటాయించిన సెంటర్‌కు రెండు గంటల ముందే అంటే 9 గంటలకే చేరుకోవాలన్నారు. బాల్‌పాయింట్‌ పెన్‌, హెచ్‌బీ2బీ పెన్సిల్‌ తమ వెంట తీసుకురావాలని తెలిపారు.  

Advertisement
Advertisement
Advertisement