29న పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2022-05-25T06:21:13+05:30 IST

పాలిటెక్నిల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పాలిసెట్‌)ను ఈనెల 29వ తేదీన ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా రెవిన్యూ అధికారి (డీఆర్‌వో) బి. సుబ్బారావు తెలిపారు.

29న పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష

 రాజమహేంద్రవరం, మే 24(ఆంధ్రజ్యోతి) : పాలిటెక్నిల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పాలిసెట్‌)ను ఈనెల 29వ తేదీన ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు  జిల్లా రెవిన్యూ  అధికారి (డీఆర్‌వో) బి. సుబ్బారావు తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం పాలిసెట్‌ ఏర్పాట్ల పై ఎగ్జామినర్‌, ఇతర అధికార్లతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కో ఆర్డినేషన్‌ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.29వ తేదీ ఉదయం 11 నుంచి  1 గంట వరకూ  పరీక్ష ఉం టుందని తెలిపారు. 10.45 గంటలకే విద్యార్థులు పరీక్షాహాలుకు చేరుకోవాలని చెప్పారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు,జాయింట్‌ కోఆర్డినేటరకు డిపార్టుమెంట్ల అధికారులు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో 5,220 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. జిల్లాకు సంబంధించి రాజమహేంద్రవరంలోనే 12 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, 100 మీటర్ల దూరంలో జిరాక్స్‌ కేంద్రాలు లేకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. సమావేశంలో ప్రవేశ పరీక్షల చీఫ్‌ పర్యవేక్షకులు, పాలిటెక్నిక్‌  ప్రిన్సిపాల్‌ వి.నాగేశ్వరరావు, మెకానికల్‌  హెచ్‌ వోడీ జి.జగన్మోహనరావు, డీఎంహెచ్‌వో స్వర్ణలత,ఏఎస్పీ రజని పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T06:21:13+05:30 IST