రేపే పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌

ABN , First Publish Date - 2022-05-28T06:08:25+05:30 IST

పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణవేణి అధికారులకు సూచించారు.

రేపే పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్‌వో కె.కృష్ణవేణి

15 కేంద్రాలు.. 5,722 మంది విద్యార్థులు

కేంద్రాల వద్ద 144 సెక్షన్‌.. జిరాక్స్‌ సెంటర్ల మూసివేత  : డీఆర్‌వో కృష్ణవేణి సమీక్ష


భీమవరం/తణుకు, మే 27 : పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణవేణి అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లో శుక్ర వారం సంబంధిత అధికారులు, పోలీసు, విద్యుత్‌, వైద్య, పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు, లైజాన్‌ అధికారులతో సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఈ నెల 29 ఉదయం 11 గంటల నుంచి  మధ్యాహ్నం ఒంటి గంట వర కు జిల్లాలో 15 కేంద్రాలలో 5,722 మంది పరీక్షలు రాయనున్నా రు. తణుకు పది కేంద్రాల్లో 3,367 మంది, భీమవరంలో ఐదు కేంద్రాల్లో 2,355 మంది హాజరు కానున్నారు. సిబ్బందితోపాటు విద్యార్థులకు సైతం మొబైల్‌ ఫోన్లు, వాచీలు, కాలిక్యులేటర్లు, ఐ పాడ్‌, బ్లూ టూత్‌, పేజర్‌ తదితర ఎలకా్ట్రనిక్‌ పరికరాలకు అను మతించరు. విద్యార్థులను ఉదయం పది గంటల నుంచి అనుమ తిస్తారు. తాగునీరు, శానిటేషన్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు, నిరంతర విద్యుత్‌ సరఫరా ఏర్పాటుచేయాలి. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించి, ఇంటర్‌ నెట్‌ షాపులు, జిరాక్స్‌ షాపులు మూసి ఉంచాలి’ అని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కో ఆర్డినేటర్‌ ఫణిప్రసాద్‌, తణుకు పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రిన్సి పాల్‌ వై.రాజేంద్రబాబు, తహశీల్దార్లు కేవీ రమణరావు, పీఎన్‌డీ ప్రసాద్‌, పోలీసు, విద్యుత్‌, హెల్త్‌ శాఖ అధికారులు, పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు, లైజన్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు. 


పది కేంద్రాల్లో పరీక్షలు

తణుకు పరిధిలోని పది కేంద్రాల వివరాలను ఎస్‌ఎంవీఎం పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వై.రాజేంద్రబాబు తెలిపారు. తణుకులోని ఎస్సీఐఎం డిగ్రీ కాలేజిలో 240 మంది, ఎస్‌కేఎస్డీ మహిళా కాలేజ్‌ 400 మంది, మాంటిస్సోరి స్కూలు 360, బాలు రోన్నత పాఠశాల ఎ సెంటర్‌ 250, బాలురోన్నత పాఠశాల బి సెంటర్‌ 168, శశి ఇంగ్లీషు మీడియం హైస్కూలు 300, ఎస్‌ఎం వీఎం పాలి టెక్నిక్‌ 679 మంది, ప్రగతి జూనియర్‌ కాలేజి 240, ఉండ్రాజవరం ఎంవీఎన్‌ జిల్లా పరిషత్‌ హైస్కూలు 480 మంది విద్యార్థులు హాజరవుతారు. పాలిసెట్‌ సందర్భంగా ఆదివారం పరీ క్షలు జరిగే కేంద్రాల వద్ద ఉదయం తొమ్మిది నుంచి రెండు గంట ల వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని తహశీల్దార్‌ పీఎన్‌డీ ప్రసాద్‌ తెలిపారు. జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలని కోరారు.

Updated Date - 2022-05-28T06:08:25+05:30 IST