కార్పొరేట్‌ గుప్పిట్లో.. పౌలీ్ట్ర పరిశ్రమ!

ABN , First Publish Date - 2022-05-26T06:00:59+05:30 IST

కార్పొరేట్‌ గుప్పిట్లో.. పౌలీ్ట్ర పరిశ్రమ!

కార్పొరేట్‌ గుప్పిట్లో.. పౌలీ్ట్ర పరిశ్రమ!
కార్పొరేట్‌ కంపెనీల కోసం రైతులు పెంచిన కోళ్లు

కంపెనీల ఆగడాలతో కూలీలుగా కోళ్ల రైతులు
కిలో చికెన్‌ రూ.300 దాటినా రైతుకు దక్కేది నాలుగున్నరే!
 నేడు అన్నవరంలో రాష్ట్రస్థాయి నేతల సమావేశం
జూన్‌ 1 నుంచి లాక్‌డౌన్‌  ప్రకటన


కొన్ని కార్పొరేట్‌ శక్తులు రాష్ట్రంలోని కోళ ్లపరిశ్రమలను తమ గుప్పిట్లోకి తీసుకుని పౌలీ్ట్ర రైతులను కూలీలుగా మార్చేశాయి. ఒకప్పుడు సొంతంగా కోళ్ల ఫారాలను పెట్టుకుని మార్కెటింగ్‌ చేసుకున్న రైతులు, కంపెనీల ఆగడాల వల్ల  ఇప్పుడు కోళ్లను పెంచలేని, పెంచితే అమ్మలేని స్థితికి చేరుకున్నారు. మార్కెట్‌లో కిలో చికెన్‌ ధర మూడొందల వరకూ ఉంది. రోజురోజుకూ ధర పెరుగుతూనే ఉంది. కాని కోడిని పెంచిన రైతుకు కిలోకు దక్కుతోంది కేవలం నాలుగున్నర రూపాయలే.. ఆశ్చర్యంగా ఉన్నా..ఇది నిజం.

ద్వారకాతిరుమల, మే 25: పౌలీ్ట్ర రంగంలో కొన్నేళ్లుగా పుట్టగొడుగుల్లా పెరిగిన కార్పొరేట్‌ కంపెనీలు హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్లను శాసిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ విధానంతో పౌలీ్ట్ర రైతుల బతుకులను ఆగం చేస్తున్నాయి. హేచ రీల నుంచి పిల్లలను, కంపెనీల నుంచి ఫీడ్‌ ను కార్పొరేట్‌ తెచ్చిస్తే, కోళ్లను పెంచిపెట్టే కూలీలుగా రైతులు మిగిలారు. చాకిరీ చేసేది రైతులైతే లాభాలన్నీ కార్పొరేట్‌ కంపెనీల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా గ్రోయింగ్‌ చార్జీలు పెంచాలని  కంపెనీలను కోరినా ఏదోవంకతో తగ్గిస్తున్నారే గానీ, పెంచడం లేదని పౌలీ్ట్ర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా వందలాది రైతులు ఇంటిగ్రేటెడ్‌ పౌలీ్ట్ర పరిశ్రమను వదిలి పెడు తుండగా..ఇది తప్ప వేరే పని తెలియనివారు గ్రోయింగ్‌ చార్జీలు పెంచాలంటూ కంపెనీలను ప్రాధేయపడుతున్నారు.

శ్రమంతా రైతుదే..
మొదట్లో కార్పొరేట్‌ కంపెనీలు రైతుల నుంచి వాళ్లు చెప్పిన రేటుకే కోళ్లను కొని మార్కెటింగ్‌ చేశాయి. క్రమంగా మార్కెట్‌పై పట్టు సాధించాయి. హేచరీస్‌, దాణా, కంపెనీలతో కలిసి ఇంటిగ్రేటెడ్‌ విధానానికి తెరదీశాయి. కొన్ని హేచరీలే స్వయంగా కం పెనీల అవతారమెత్తాయి. వారి దగ్గరే కోడి పిల్లలు, ఫీడ్‌ కొని వారికే అమ్మడం తప్ప వేరే గత్యంతరం లేని స్ధితికి రైతులను దిగ జార్చాయి. రైతులను కూలీలుగా మార్చి వాళ్ల షెడ్లలోనే కోళ్లను పెంచి వందల కోట్ల వ్యా పారం చేస్తున్నారు. కోడిపిల్ల వచ్చిన మొదటి రోజు నుంచి కోళ్లను లిఫ్టింగ్‌ చేసేవరకూ శ్రమంతా రైతులదే.

లోపాలు చూపి..కోతలు కోసి..
కోళ్లఫారాల వద్ద కూలీ ఖర్చు, వ్యాక్సినేషన్‌ ఖర్చు, కరెంటు బిల్లు, ఊక, కోళ్ల లిఫ్టింగ్‌  ఖర్చులన్నీ రైతులవే. కానీ కంపెనీలు కోడి పిల్లలకు 34 రూపాయలు, దాణా కిలోకు 47, నిర్వహణ చార్జీలుగా ఆరు రూపాయలు ఖర్చురాసి లెక్కలు చెబుతున్నాయి. మందుల ఖర్చంటూ అదనపు చార్జీలు మోపుతున్నాయి. కోళ్లను పెంచి ఇచ్చాక సంస్ధ పెట్టిన ఖర్చు లెక్కతీస్తే కేజీ చికెన్‌ తయారీకి 95 రూపా యలు మించకూడదు. అప్పుడే రైతుకు 5 రూపాయల 80పైసలు చెల్లిస్తామని కంపె నీలు చెబుతున్నాయి. కానీ..అదీ ఇదంటూ లోపాలు చూపించి కోతలు కోసి, చివరకు కిలోకు ఇచ్చే నాలుగున్నర రూపాయలే ఇస్తున్నాయని  రైతులు వాపోతున్నారు.



ఉమ్మడి జిల్లా ఇంటిగ్రేటెడ్‌ బ్రాయిలర్‌ రైతుసంఘం డిమాండ్లు..
కూలీ ఖర్చు, విద్యుత్‌ చార్జీలు, బొగ్గు, ఊక, పేపరు, పైపులైన్‌, డ్రింకర్‌, ఫీడర్‌ ఖర్చులు పెరిగిన దృష్ట్యా స్టాండర్డ్‌ రియరింగ్‌ చార్జీలు కేజీకి రూ.12 ఇవ్వాలి. కోడిపిల్లలు వచ్చేముందు రైతుకు ఐదు రోజుల ముందే చెప్పాలి. నాణ్యమైన కోడిపిల్లల్లో పుంజులు 70 శాతం, పెట్టలు 30 శాతం ఇవ్వాలి. వివరాలతో కూడిన నాణ్యమైన దాణాఇవ్వాలి. పదివేల బ్యాచ్‌కు రైతుకు రూ.1,72,000  అవుతుండగా కంపెనీలు ఇచ్చేది రూ.94,000 రూపాయలు..  రైతుకు ఒకబ్యాచ్‌కు రూ.78, 000 నష్టం వస్తోంది. రైతు నష్టపోకుండా చూడాలంటూ.. న్యాయ పరమైన కోర్కెల సాధన కోసం గురువారం అన్నవరంలో రాష్ట్రస్థాయి నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నారు. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని, డిమాండ్లు ఆమోదించాలని లేకుంటే జూన్‌1 నుంచి లాక్‌డౌన్‌ ప్రకటిస్తామని కోళ్ల రైతులు హెచ్చరించారు.



Updated Date - 2022-05-26T06:00:59+05:30 IST