తగ్గిన వాయు కాలుష్యం

ABN , First Publish Date - 2022-08-08T06:06:39+05:30 IST

గాలి నాణ్యతలో నగరం సేఫ్‌ జోన్‌లో ఉంది. తెలంగాణ రాష్ట్ర

తగ్గిన వాయు కాలుష్యం

జూన్‌, జూలైలో నగరంలో స్వచ్ఛమైన గాలి 

వర్షాలే కారణం

అల్వాల్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): గాలి నాణ్యతలో నగరం సేఫ్‌ జోన్‌లో ఉంది. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎ్‌సపీసీబీ) డేటా ప్రకారం గాలి నాణ్యతలో మెరుగుదల కనిపించింది. 2022 జనవరి నుంచి మే వరకు బొల్లారం, సనత్‌నగర్‌, బాలానగర్‌, ఉప్పల్‌, జుబ్లీహిల్స్‌, చార్మినార్‌, అబిడ్స్‌లతో సహా చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ (101 నుంచి 200) వరకు ఉంది. నాడు గాలిలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జూన్‌, జూలైకి సంబంధించిన టీఎ్‌సపీసీబీ  డేటాలో గాలి నాణ్యత మెరుగుపడినట్లు నమోదైంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (0-50) లేదా సంతృప్తికరమైన ఏక్యూఐ (51 నుంచి100) ఉంది. జూన్‌ వరకు బాలానగర్‌లో వాతావరణంలో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంది. జూలైలో అక్కడ ఏక్యూఐ స్థాయి సమూలంగా మెరుగైంది. రాజేంద్రనగర్‌, కేబీఆర్‌ పార్క్‌ పరిసర ప్రాంతాల్లో గత నెలలో గాలి నాణ్యత అత్యుత్తమంగా నమోదైంది. అబిడ్స్‌, చిక్కడపల్లి, నాచారం, సైనిక్‌పురి, ట్యాంక్‌బండ్‌, సనత్‌నగర్‌, నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌, పాశమైలారం, ఇక్రిసాట్‌లలో కాలుష్య స్థాయిలు కనిష్ఠ స్థాయిలో స్థిరంగా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌, ప్యారడైజ్‌, మాదాపుర్‌ వంటి ప్రధాన నివాస ప్రాంతాల్లో గాలి నాణ్యత సంతృప్తికరంగా ఉంది. వర్షాల కారణంగా గాలి నాణ్యత మెరుగుపడినట్లు అధికారులు పేర్కొంటున్నారు.


Updated Date - 2022-08-08T06:06:39+05:30 IST