ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు

ABN , First Publish Date - 2021-07-24T06:07:12+05:30 IST

కేసీఆర్‌ రాష్ట్రంలో, వారి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రజధానాన్ని దోచుకుం టున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరు ణ మండిపడ్డారు.

ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు
పంటలను పరిశీలిస్తున్న మాజీ మంత్రి డీకే అరుణ

- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ


గద్వాల (ఆంధ్రజ్యోతి)/ధరూరు/గద్వాల క్రైం, జూలై 23 : కేసీఆర్‌ రాష్ట్రంలో, వారి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రజధానాన్ని దోచుకుం టున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరు ణ మండిపడ్డారు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలో ఇ టీవల తెగిపోయిన నెట్టెంపాడు 99 ప్యాకేజీ ప్రాంతాన్ని, నీటి మునిగి న పొలాలను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న కాలువకు నీటి విడుదల చేయడం వల్ల అది తెగిపోయి, వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు పేరుకుపో యాయని అన్నారు. అధికారులకు బదులు సర్పంచులు అనాలోచితం గా నిర్ణయంగా తీసుకున్నారని ఆరోపించారు. దీనికి కారణమైన వారి పై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. 99 ప్యాకేజీకి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడే కాంట్రాక్టర్‌గా ఉండి, పనులను చేయలేదని విమర్శించారు. ఐదేళ్లు గడుసున్నా తట్టెడు మట్టి పని చే యించలేని చేతకాని ప్రభుత్వం కారణంగానే నేడు రైతులకు అపార నష్టం వాటిల్లిందని ధ్వజమెత్తారు. కాలువ తెగిన వెంటనే కలెక్టర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడానని, జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలించినా నేటి వరకు సమీక్ష చేయలేదని ఆమె అన్నారు. అనంతరం ఆమె కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌ శ్రుతిఓఝాను కలిశారు. రైతుల బాధలను, ఇబ్బందులను వివరించారు. వర్షాల వల్ల ముంపు గ్రామాలలో ఉన్న రైతుల పొలాలు నీ టి పాలయ్యాయని వివరించారు. దీంతో వారు తీవ్రంగా నష్టపోయా రని, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, వెంకట్రాములు, రామాంజనేయులు, త్యాగరాజు, కుమ్మరి శ్రీనివాసులు, జ యశ్రీ, వెంకటేశ్వర్‌రెడ్డి, మిర్జాపురం రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T06:07:12+05:30 IST