కాలుష్యాన్ని నియంత్రించాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-09-22T08:42:15+05:30 IST

జిల్లాలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవా లంటే కాలుష్యాన్ని నియంత్రించాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ పేర్కొన్నారు. సోమ వారం సాయం

కాలుష్యాన్ని నియంత్రించాలి: కలెక్టర్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 21: జిల్లాలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవా లంటే కాలుష్యాన్ని నియంత్రించాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ పేర్కొన్నారు. సోమ వారం సాయంత్రం కలెక్టర్‌ ఛాంబర్‌లో కాలుష్య నియంత్రణపై జరిగిన జిల్లా బో ర్డు సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అత్యధికంగా పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్న ప్రాంతంగా చీమకుర్తి నిలిచిందన్నారు.


స్వచ్ఛమైన వాతావర ణాన్ని కల్పించాల్సిన బాధ్యత అధికారులు, పరిశ్రమల నిర్వహకులపై ఉంద న్నా రు.  సమాజానికి మేలు చేసే దిశగా పరిశ్రమల యజమానులు సహకరిం చాలన్నారు. సమావేశంలో కాలుష్య నియంత్రణ బోర్డు ఈఈ నాగిరెడ్డి, గ్రానైట్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి హాజీన్‌, చీమకుర్తి మునిసిపల్‌ కమిషనర్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-09-22T08:42:15+05:30 IST