Advertisement
Advertisement
Abn logo
Advertisement

కమ్ముకున్న కాలుష్యం

ఫమేల్కోనకపోతే ముప్పే..!

కాలుష్యం అధికంగా నమోదయ్యే నగరాల్లో గుంటూరు

ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

ఉక్కిరి బిక్కిరి అవుతున్న నగరవాసులు

మారకపోతే మరో ఢిల్లీగామారే ప్రమాదం!


కాలుష్యం... కంటికి కనపడదు.. కానీ పెనుభూతంలా మారి మనల్నే మింగేస్తుంది.. ఈ కాలుష్యానికి ఢిల్లీ వంటి మహానగరాలే విలవిల్లాడుతున్నాయి. గుంటూరు నగరం కూడా కాలుష్యం అధికంగా నమోదయ్యే నగ రాల్లో ఒకటిగా ఉంది. ఇప్పటికైనా కాలుష్యాన్ని నివారిం చి.. పర్యావరణాన్ని సంరక్షించడంలో మన వంతు కృషి చేయకపోతే భావితరాలకు తీరని అన్యాయం చేసిన వాళ్లమవుతాం.. నిపుణులు చేస్తున్న హెచ్చరిక ఇది.!


గుంటూరు(తూర్పు), నవంబరు27: దేశవ్యాప్తంగా అధిక కాలుష్యం నమోదయ్యే 132 నగరాల్లో మన గుంటూరు నగరం కూడా ఒకటి. పరిశ్రమలు, గృహ, శబ్ధ కాలుష్యాలు పెద్దగా లేకపోయిన ప్పటికీ వాహన కాలుష్యం వల్లే గుంటూరు ఈ జాబితా లో చేరిపోయింది. కాలంచెల్లిన వాహనాలతో నగరానికి ఈ పరిస్థితి వచ్చిందని కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం నగరంలో వాయు కాలుష్యం 70-74 మైక్రో గ్రామ్స్‌ క్యూబిక్‌ క్యూడ్‌(ఎంజీక్యూక్యూ)గా  నమోదు అవుతుంది. 60ఎంజీక్యూక్యూ కంటే తక్కువుగా ఉంటే సాధారణ స్థితి. 2015లోనే నగరంలో వాయు కాలుష్య శాతం 63ఎంజీక్యూక్యూగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 


నిషేధం ఎక్కడా..?

ఉదాహరణకు ఈనెల 10నుంచి 70మి.మీ కంటే తక్కువ మందం గల క్యారీబాగ్‌లను నిషేధించారు. అధికారులు ఎప్పటిలాగే రెండురోజలు హడావుడి చేశారు. కానీ పరిస్థితి  మళ్లీ మామూలే..! మెల్లగా ఇప్పుడిప్పుడే దుకాణాల్లో క్యారీబాగ్‌లు దర్శనమిస్తున్నాయి. వరుసగా ఆరునెలలుపాటు తనిఖీలు భారీ జరిమానాలు విధిస్తే  ఫలితాలు వస్తాయి తప్ప ఇటువంటి నామమాత్రపు చర్యలతో ఎటువంటి ప్రయోజనం ఉండదనేది వాస్త వం. స్వచ్ఛత విషయంలో క్యారీబ్యాగ్‌లనే నివా రించలేకపోతే రానున్న రోజుల్లో కేంద్రం తీసుకు వస్తున్న సింగిల్‌ ప్లాస్టిక్‌ నిషేధం, ఈ-చెత్తపై చర్యలు వంటి విషయాల్లో ఏమేరకు ఫలితాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు.


ప్రణాళికలతో సరి..

2024నాటికి కాలుష్యాన్ని 58 ఎంజీ క్యూకూకు తగ్గించాలని ప్రణాళికలు రూ పాందించాలని, విజయవాడలో మాదిరి కంప్రెస్డ్‌ యూనిట్లును ఏర్పాటు చేయాలని, కాలంచెల్లిన వాహనాలను రోడ్లుపై తిరగకుండా కఠినచర్యలు తీసుకోవాలని ఈనెలలో జరిగిన సమావే శాల్లో కలెక్టర్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రజారవాణా వ్యవస్ధను జిల్లాలో మరింత పెరిగేలా చూడాలని ఆయన తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు ఎంతమేరకు అమలవుతాయో చూడాలి.


ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తేనే ఫలితాలు...

జిల్లాలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం కార్తికేయ అనే ప్రత్యేక అఽధికారిని నియమించింది. కానీ అనుకున్న మేర ఫలితాలు రావడం లేదు. దీనికి శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణం. సాధారణంగా ప్రతి విభాగా నికి ప్రత్యేకశాఖ, యంత్రాంగం ఉం టుంది. కానీ కాలుష్యనివారణకు రవాణా శాఖ, నగరపాలక సంస్థ, పరిశ్రమలశాఖ, కాలుష్య నియం త్రణ, విజిలెన్స్‌ ఇలా అన్నిశాఖలు కలిసి కార్యాచరణ రూపొందించాలి. అలా కాకుండా ఇతరదేశాల మాది రి కాలుష్య నివారణకు అన్ని అధికా రాలను కేటాయిస్తూ ప్రత్యేక విభాగా న్ని ఏర్పాటు చేసి, తగినంత సిబ్బందిని సమ కూర్చగలిగితే ప్రయోజనం ఉండవచ్చ ని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు


స్వచ్ఛతలో వెనకబాటు... 

స్వచ్ఛతలో గత ఏడాదికంటే ఈసారి మరింత వెనకబడినట్టు గణాంకాలు చెబుతు న్నాయి. స్వచ్ఛత ర్యాంకుల్లో గత ఏడాది గుంటూ రు నగరం 120 వర్యాంకు సాధించగా ఈసారి అది 130కు చేరింది. తడిపొడి చెత్త సేకరణ, క్లాప్‌ కార్య క్రమాలు సరిగా నిర్వహించకపోవడం వల్ల ర్యాంకు దిగజారిందని నివేదికలు వెల్లడించాయి. రహదారులు సరిగా లేకపోవడం, వాటి నుంచి వచ్చే దుమ్ము, దూళి అంతేగాక ఎక్కడ చెత్త అక్కడే ఉండ టం వంటి కారణాలతో ర్యాంకు దిగజా రడానికి కారణాలుగా చెప్పు కోవాలి.


ఈ-చెత్తతో సమస్యే.. 

ఈ-చెత్త సమస్య నగరంలో కరోనాకు ముందు నుంచే ఉంది. దీంతో ఆ సమ యంలో ఈ-చెత్త వ్యర్ధాలపై అవగాహన, సైక్లింగ్‌ పరిశ్రమలస్థాపన వంటి విషయా లపై విజయవాడ, గుంటూరు నగరాల్లో అనేక సమావేశాలు, అవగాహన కార్య క్రమాలు నిర్వహించారు. కానీ కొవిడ్‌ కార ణంగా రెండేళ్ల నుంచి ఇవి జరగడం లేదు. అంతేగాక కొవిడ్‌ సమయంలో ఎలకా్ట్రనిక్‌ వస్తువుల వినియోగం పెరిగింది. దీంతో అదేస్థాయిలో వ్యర్ధాలు పెరిగాయి. నగరం లో ఏడాదికి 6 శాతంకు పైగా ఈ చెత్త వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది 16-20శాతానికి పెరిగితే ఈ-స్ర్కాబ్‌ ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై ప్రత్యేకచర్యలు చేపట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

  ప్లాస్టిక్‌ వ్యర్థాలతో జంతువులతో పాటు, మానవాళి ఆరోగ్యానికి పెనుప్రమాదమని నిపుణు లు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌ను కాల్చితే వచ్చే డయాక్సిన్‌, ప్యూరాన్‌ విషవాయువులు క్యాన్సర్‌ను కలగజేస్తాయి. ఫ రంగుల సంచుల్లో తయారీలో వాడే సీసం పిల్లల పెరుగుదల, జ్ఞాపకశక్తిని హ రించివేస్తుంది. క్యాడ్మియం కిడ్నీలను దెబ్బతీ స్తుంది.ఫ వేడి ఆహార పదార్ధాలను నిలువచేస్తే ప్రమాదకరమైన ప్లాస్టిక్‌ గ్రాన్యుల్‌ పిగ్మంట్లు అం దులో కలసిపోయి ప్రాణాంతక క్యాన్సర్‌కు దారి తీస్తాయి. ఫ ప్లాస్టిక్‌ వ్యర్ధాలను తయారుచేసే ప్రక్రియలో వెలువడే క్లోరినేటెడ్‌ హైడ్రోకార్బన్లు కేంద్రనాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. 


ఈ- చెత్త రీ సైక్లింగ్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి

ఈ- చెత్త సమస్య రోజు రోజుకు పెరుగుతున్న మాట వాస్తవం. మామూలు చెత్తను సైక్లింగ్‌ చేయాలంటే అనేక సాంకేతిక సమస్యలు ఎదురవు తాయి. కానీ ఈ-చెత్త సేకరణ, వాటి సైక్లింగ్‌ విషయంలో అంతపెద్ద సమస్యలు ఉండవు. పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలి. 

- డి.తిరుపతిరెడ్డి, ఏపీ నేషనల్‌ గ్రీన్‌కోర్‌  జిల్లా కో ఆర్డినేటర్‌

 

Advertisement
Advertisement