భారతీయుల ఆయుష్షు 9ఏళ్లు తగ్గనుందట!

ABN , First Publish Date - 2021-09-02T18:13:38+05:30 IST

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ వరుసగా మూడు సార్లు మొదటి స్థానంలో నిలిచింది. అలాగే దేశంలోని చాలా నగరాలు అత్యంత తీవ్ర కాలుష్యంలో ఉన్నాయి

భారతీయుల ఆయుష్షు 9ఏళ్లు తగ్గనుందట!

న్యూఢిల్లీ: రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం కారణంగా భారతీయుల ఆయుష్షు భారీగా తగ్గిపోనున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు చెందిన ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ పేర్కొంది. తాజాగా చేసిన అధ్యయనంలో 40 శాతం మంది భారతీయులు ఆయుష్షు తొమ్మిది ఏళ్లకు పైగానే తగ్గనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం భారతీయుల సగటు ఆయష్షు 65-70 గా ఉంది. చికాగో యూనిర్సిటీ చెప్పిన లెక్కలు నిజమే అయితే అది 56-61 కి తగ్గుతుంది. భారతదేశంలో కాలుష్యం తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, దీనిని అదుపులోకి తీసుకురాకపోతే ఇంకా చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ అధ్యయనం తెలిపింది.


ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ వరుసగా మూడు సార్లు మొదటి స్థానంలో నిలిచింది. అలాగే దేశంలోని చాలా నగరాలు అత్యంత తీవ్ర కాలుష్యంలో ఉన్నాయి. అయితే కొవిడ్ లాక్‌డౌన్ కొంత ఉపశమనం ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో నివారణ చర్యలు మాత్రం చేపట్టాలని ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ అధ్యయనం సూచించింది. వాస్తవానికి దేశంలో కాలుష్య కోరల్లో ఉన్న 102 నగరాల్లోని కాలుష్యాన్ని 2024 వరకు 20 శాతం నుంచి 30 శాతం వరకు తగ్గించాలని నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం లక్ష్యంగా పెట్టుకుంది. అంతే కాకుండా దేశంలోని సగటు వ్యక్తి ఆయుష్షును 1.7 సంవత్సరాలకు పెంచాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. కాకాపోతే వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నట్లు ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ అధ్యయనం పేర్కొంది.

Updated Date - 2021-09-02T18:13:38+05:30 IST