కరీంనగర్: ఫూర్వ కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. మొత్తం 1324 ఓట్లకు గాను 1320 ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, బీజేపీ ఎంపీ బండి సంజయ్ తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. పట్టణంలోని ఎస్సారార్ కాలేజీకి బ్యాలెట్ బాక్స్‌లను తరలించారు. కరీంనగర్ పోలింగ్ కేంద్రంలో టీఆర్‌ఎస్, పోలీస్ ఘటన మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 14న కౌంటింగ్ జరుగునుంది.