నేడే రెండో విడత పోలింగ్‌

ABN , First Publish Date - 2021-02-13T06:28:24+05:30 IST

జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. నరసరావుపేట డివిజన్‌లో శనివారం పోలింగ్‌ జరగనున్నది.

నేడే రెండో విడత పోలింగ్‌
నరసరావుపేట మండలం జొన్నలగడ్డలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు

రెండో విడతకు అంతా సిద్ధం

166 పంచాయతీలు.. 1,397 వార్డుల్లో ఓటింగ్‌

ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు తరలిన సిబ్బంది

నరసరావుపేట డివిజన్‌ వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు

పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠమైన పోలీసు బందోబస్తు


నరసరావుపేట, ఫిబ్రవరి 12: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. నరసరావుపేట డివిజన్‌లో శనివారం  పోలింగ్‌ జరగనున్నది. ఆయా ప్రాంతాల నుంచి శుక్రవారం ఎన్నికల సామగ్రి తీసుకున్న పోలింగ్‌ అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్లారు. పోలింగ్‌ నిర్వహణకు బూత్‌లను సిద్ధం చేశారు. ఉదయం 6.30 గంటల కల్లా పోలింగ్‌ ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.


డివి జన్‌లోని 11 మండలాల్లో 5,01,143 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ ప్రశాంత వాతా వరణంలో నిర్వహించేందుకు పటిష్ఠమైన పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. డివిజన్‌ వ్యాప్తంగా ఎన్నికల జరిగే గ్రామాల్లో 144వ సెక్షన్‌ విధించారు. కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ పోలింగ్‌ ఏర్పాట్లు, బందోబస్తు నిర్వహణ పై అధికారులతో సమీక్షించారు. ఎన్నికల పరిశీలకుడు కాంతి లాల్‌ దండే శుక్రవారం డివిజన్‌ లోని పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్‌ అనం తరం జరిగే ఓట్ల లెక్కింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధి కారులకు దండే సూచించారు. ఎక్కువుగా కౌంటింగ్‌ టేబుల్స్‌ ఏ ర్పాటు చేసి 3 గంటల్లో కౌంటిం గ్‌ పూర్తి చేయాలని అధికారుల ను ఆదే శించారు.


పోలింగ్‌ జరగనున్న 175 పంచా యతీల్లో 703 అత్యం త సమస్యాత్మక, 733 సమస్యా త్మకమైనవిగా గుర్తించారు. ఆయా కేంద్రాల వద్ద ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ చేస్తున్నారు. ప్రతి పంచాయతీకి మైక్రో అబ్జర్వర్‌లను నియమించారు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌ తెలిపారు. జాబితాలో పేరు ఉన్న వారందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.


మండలానికో డీఎస్పీ

పోలింగ్‌ సందర్భంగా మండలానికో డీఎస్పీ, ముగ్గు రు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలను నియమించారు. ప్రతి మండలాన్ని నాలుగు రూట్లుగా విభజించారు. ప్రతి రూటు కు ఒక స్ర్టైకింగ్‌ ఫోర్సు, మొబైల్‌ పార్టీలను ఏర్పాటు చేశారు.


రూరల్‌ ఎస్పీ పర్యవేక్షణలో 11 మంది డీఎస్పీలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 93 మంది సీఐ లు, 127 మంది ఎస్‌ఐలు, 2,781 మంది సిబ్బంది, ఏపీ ఎస్పీ, సీఆర్‌పీఎఫ్‌, ఆక్టోపస్‌ బలగాలు బందో బస్తు విధు ల్లో పాల్గొంటున్నాయి. పోలింగ్‌కు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ విజయ భాస్కర్‌ హెచ్చరించారు. విజ యోత్సవ ర్యాలీలకు  అనుమ తి లేదన్నారు. ప్రశాంత పో లింగ్‌, కౌంటింగ్‌కు ప్రతి ఒక్క రూ సహకరించాలని కోరారు.


ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చేయాలని వినతి

గుంటూరు: రొంపిచర్ల మం డలం గోగులపాడులో పంచా యతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గృహనిర్బంధం చేయాలని సర్పంచ్‌ అభ్యర్థి లింగా వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు టీడీపీ నాయ కులతో కలిసి శుక్రవారం ఆయన కలెక్టర్‌, రూరల్‌ ఎస్పీ కార్యాలయాల్లో, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.


స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో సీఐ రిగ్గింగ్‌కు ప్రయత్నిస్తున్నార న్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల బందోబస్తు నుంచి సీఐను తప్పించాలని కోరారు. టీడీపీ సానుభూతి పరులను సీఐ భయబ్రాంతులకు గురి చేసి వైసీపీ బల పరిచిన అభ్యర్థి గెలిచేలా రిగ్గింగ్‌కు ప్రయత్నిస్తున్నార న్నారు. గ్రామంలో పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరగా లాంటే ఎమ్మెల్యేని గృహనిర్బంధం చేయడంతో పాటు సీసీ కెమెరాలు, వెబ్‌ కాస్టింగ్‌, పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేయాలన్నారు. సీఐ కృష్ణయ్య తమ గ్రామంలోకి అడుగు పెడితే ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలుగుతుందన్నారు.


ఏకగ్రీవం..98

ఎన్నికలు జరిగే పంచాయతీలు 

36 గురజాల డివిజన్‌లో ముగిసిన ఉపసంహరణలు

మాచర్ల, వెల్దుర్తి, కారంపూడి మండలాల్లో పంచాయతీలన్నీ ఏకగ్రీవమే


పిడుగురాళ్ల, ఫిబ్రవరి 12: గురజాల రెవెన్యూ డివిజన్‌లో నామినేషన్‌ ఉపసంహరణ పర్వం ముగిసింది. డివిజన్‌లోని 9 మండలాల పరిధిలో 134 పంచాయతీలకు 98 ఏకగ్రీవమైనట్లు శుక్రవారం అధికారులు తెలి పారు. మిగిలిన 36 పంచాయతీల్లో మాత్రమే అభ్యర్థులు పోటీలో నిలి చారు. మాచర్ల మండలంలో 16, వెల్దుర్తి మండలంలో 20, కారంపూడి మండలంలో 15  పంచాయతీలు  మొత్తం ఏకగ్రీవమయ్యాయి. దుర్గి మండలంలో 15 పంచాయతీలకు 14 ఏకగ్రీవం కాగా ఒక్క పంచా యతీలో మాత్రమే ఎన్నిక జరగనున్నది.


రెంటచింతల మండలంలో 11 పంచాయతీలకు 9 ఏకగ్రీవం కాగా రెండింటిలో, గురజాల మండలంలో 12 పంచాయతీలకు మూడు ఏకగ్రీవం కాగా 9 గ్రామాల్లో, దాచేపల్లి మండలంలో 14 గ్రామ పంచాయతీలకు 6 ఏకగ్రీవం కాగా 8 పంచా యతీల్లో,  మాచవరం మండలంలో 15 పంచాయతీలకు 4 ఏకగ్రీవం కాగా 11 పంచాయతీల్లో, పిడుగురాళ్ల మండలంలో 16 పంచాయతీలకు  11 ఏకగ్రీవం కాగా 5 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.  డివిజన్‌లో 1434 వార్డులుకు 1072 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 362 వార్డులకు 755 మంది పోటీలో నిలిచారు.


నిష్పక్షపాతంగా ఎన్నికలు : రూరల్‌ ఎస్పీ 

మాచర్ల: నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు.  గురజాల డివిజన్‌ పరిధి లో ఎన్నికల నిర్వహణలో భాగంగా శుక్రవారం గురజాల, కారంపూడి, దుర్గి ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం మాచర్లలో విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో ఏవైనా ఇబ్బందులుంటే పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. డివిజన్‌ పరిధిలో 16 టీంలు పనిచేస్తున్నాయన్నారు. జిల్లాలో 16 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశా మన్నారు. స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 


నామినేషన్లు.. 7,672

సర్పంచ్‌కి 1,465 వార్డులకు 6,207 దాఖలు

గుంటూరు డివిజన్‌లో ముగిసిన నామినేషన్ల పర్వం

నామినేషన్‌ వేశారని దాసుపాలెం రైతుల దుకాణాల నిలిపివేత

నామినేషన్‌ ఉపసంహరించుకుంటేనే షాపులు ఉంటాయని హెచ్చరిక

నామినేషన్‌ వేసేందుకు వచ్చిన మండేపూడి అభ్యర్థి కిడ్నాప్‌

కొనసాగుతున్న అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు


  (గుంటూరు - ఆంధ్రజ్యోతి)

గుంటూరు డివిజన్‌లో శుక్రవారం పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం మూడు రోజులకు కలిపి 7672 నామినేషన్లు దాఖలయ్యాయి. డివిజన్‌లో 266 సర్పంచ్‌ పదవులకు సుమారు 1,465 మంది, 2,810 వార్డులకు 6,207 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు డీ ఎల్‌పీవో లక్ష్మణరావు తెలిపారు. చివరిరోజు పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్ని పంచాయతీల్లో రాత్రి వరకు కూడా నామినేషన్లు వే సేందుకు అభ్యర్థులు క్యూల్లో ఉండాల్సి వచ్చింది. ప్రత్తిపాడులో వైసీపీ, టీడీపీ కుదుర్చుకున్న ఒప్పందం వెలుగు చూడటంతో శుక్రవారం ఇరుపార్టీల నా యకులు ఎవరికి వారు నామినేషన్లు దాఖలు చేశారు.   


రైతుబజారు వ్యాపారులకు షాక్‌

గుంటూరు మండల పరిధిలో దాసుపాలెంలో అధికార పార్టీకి వ్యతి రేకంగా భిక్షాలరావు అనే వ్యక్తి సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో ఆగ్రహించిన అధికార పార్టీ నా యకులు ఆ గ్రామానికి చెందిన కూ రగాయల వ్యాపారులపై ప్రతాపం చూపారు. దాసుపాలెం రైతులు గుం టూరు పట్టాభిపురంలోని రైతుబజార్‌ లో దుకాణాలు నిర్వహిస్తున్నారు.


అధికార పార్టీ నాయకులు గ్రామానికి చెందిన 20 మంది దుకాణాలను నిలిపి వేశారు. రెండు దశాబ్దాలుగా దుకాణాలు నిర్వహించుకుంటున్న వారిని రైతుబజారు నుంచి బయటకు పంపివేశారు. భిక్షాలరావుతో నామినేషన్‌ ఉపసంహరింపచేస్తేనే షాపులు ఉంటాయని నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. అక్కడికి చేరుకున్న మున్సిపల్‌ వర్కర్లు యూనియన్‌ నేత వరికల్ల రవికుమార్‌ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు షాపులు ఇవ్వకపోతే తానే సర్పంచ్‌ అభ్యర్థిని పోటీ చేయిస్తానని హెచ్చరించారు.


మండేపూడిలో నామినేషన్‌ అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు

అమరావతి: మండల పరిధిలోని మండేపూడిలో టీడీ పీ మద్దతుతో వైసీపీ నాయకుడైన వరగాని ఏడుకొం డలు సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసేందు కు శుక్రవారం ఉంగుటూరు నామినేషన్‌ కేంద్రానికి వ చ్చారు. దీంతో అతడ్ని అడ్డుకున్న వైసీపీ నాయకులు తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ విష యం తెలిసి ఏడుకొండల తమ్ముడు అప్పారావు మరో నామినేషన్‌ వేసేందుకు టీడీపీ నాయకులతో కేంద్రానికి చేరుకున్నారు. అతడ్ని అడ్డుకున్న వైసీపీ నాయకులు నామినేషన్‌ పత్రాలు లాక్కున్నారు. దీంతో అప్పారావు, అతడితో వచ్చిన వారు భయంతో పెదకూరపాడు మం డలం పరస గ్రామానికి పారిపోయారు. అక్కడి నుంచి ఎస్పీకి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు.


ఎస్పీ ఆదేశా లతో ఎస్‌ఐ రక్షణ కల్పించేందుకు వచ్చారు. మళ్లీ నామి నేషన్‌ వేసేందుకు యత్నించగా వైసీపీ కార్యకర్తలు అడ్డు కునేందుకు యత్నించగా పోలీసులు వారిని చెదరగొట్టి అప్పారావును నామినేషన్‌ కేంద్రంలోకి పంపించారు. అయితే అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి సంతకం లేకపో వడంతో అతడి నామినేషన్‌ను తిరస్కరించారు. 


 

Updated Date - 2021-02-13T06:28:24+05:30 IST