మహనీయుల విగ్రహాలతోనూ రాజకీయమా !

ABN , First Publish Date - 2022-10-03T05:28:28+05:30 IST

మహనీయుల విగ్రహాలతో రాజకీయం చేసే దౌర్భాగ్య పరిస్థితి నెలకొనడం బాధాకరమని జడ్చర్ల ఎమ్మెల్యే డా. సి.లక్ష్మారెడ్డి అన్నారు.

మహనీయుల విగ్రహాలతోనూ రాజకీయమా !
గాంధీట్రస్టు ఆవరణలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

- గాంధీ జయంతిలో ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి 

- గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ నివాళి

జడ్చర్ల, అక్టోబరు 2 : మహనీయుల విగ్రహాలతో రాజకీయం చేసే దౌర్భాగ్య పరిస్థితి నెలకొనడం బాధాకరమని జడ్చర్ల ఎమ్మెల్యే డా. సి.లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మునిసిపాలిటీ గాంధీచౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ ట్రస్టు ప్రాంగణంలో ట్రస్టు చైర్మన్‌ సీతా రాంఝావర్‌ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్క రించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గాంధీట్రస్టు స్థలంలో గాంధీ విగ్రహాన్ని, సిగ్నల్‌గడ్డ సమీపంలో మహత్మజ్యోతిరావు పూలే విగ్రహల ఏర్పాటులో స్వార్థ రాజకీయాలే జరిగాయన్నారు. అనంతరం జడ్చర్ల పట్టణలో శ్రీసత్యేశ్వర సేవా ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని, రక్తదాతలను అభినందించారు. 50 మంది రక్తదానం చేశారు. 

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు 

గాంధీ జయంతి వేడుకలను ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీతో పాటు మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జడ్చర్ల పట్టణంలోని గాంధీ చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే డా. సి.లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌లు వేర్వే రుగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జడ్చర్ల మునిసిపాలిటీ కార్యాలయంతో పాటు కావేరమ్మపేటలోని వార్డు కార్యాలయంలో గాంధీ విగ్రహానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మీ, వైస్‌ చైర్‌పర్సన్‌ పాలాదిసారిక, కమిషనర్‌ మహమూద్‌షేక్‌, కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీట్రస్టు ఆవరణలో గాంధీ ట్రస్టు, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. గత సంవత్సరం ప్రతిష్ఠించిన గాంధీ విగ్రహానికి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌, ప్రజాసంఘాల నాయకులు తెలుగు సత్తయ్య, కృష్ణయ్య యాదవ్‌, అయ్యన్న, అనిల్‌, నడిమింటి శ్రీనివాస్‌లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాగా ఇదే ప్రాంగణంలో గాంధీట్రస్టు సభ్యులు మరో గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే డా. సి.లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్‌ బాదిమి శివకుమార్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ కోడ్గల్‌ యాదయ్య, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లిలక్ష్మీ, వైస్‌చైర్‌పర్సన్‌ పాలాదిసారిక, బాదేపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ సుదర్శన్‌గౌడ్‌తో పాటు కౌన్సిలర్‌లు, పలువురు పాల్గొన్నారు. 

ఘనంగా మొదటి ఎమ్మెల్యే కొత్తకేశవులు జయంతి 

స్వాతంత్య్ర సమరయోధుడు, జడ్చర్ల నియోజకవర్గ మొట్టమొదటి ఎమ్మెల్యే కొత్తకేశవులు 118వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. జడ్చర్ల మండల ప్రజాపరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలోని కొత్తకేశవులు విగ్రహానికి ఎమ్మెల్యే డా. సి.లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తకేశవులు కుటుంబసభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. 



Updated Date - 2022-10-03T05:28:28+05:30 IST