యానిమేటర్ల తొలగింపులో రాజకీయం

ABN , First Publish Date - 2021-09-17T06:35:28+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఐకేపీలో పనిచేస్తున్న యానిమేటర్లను తొల గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

యానిమేటర్ల తొలగింపులో రాజకీయం
ఐకేపీ కార్యాలయం

ఇప్పటికే ముగ్గురి తొలగింపు.. 

మరింత మందిపై వేటు పడే అవకాశం

కుటుంబసభ్యులు టీడీపీలో ఉండటమే కారణమా.?

అధికారులపై ఒత్తిడి పెడుతున్న వైసీపీ నాయకులు

కదిరిఅర్బన్‌, సెప్టెంబరు 16: వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఐకేపీలో పనిచేస్తున్న యానిమేటర్లను తొల గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఏకపక్షంగా తొలగిస్తున్నారని యానిమేటర్లు వాపోతు న్నా రు. ప్రతిపక్ష టీడీపీకి అనుకూలంగా ఉన్న కుటుంబాలలోని సభ్యు లు యానిమేటర్లగా పనిచేస్తున్న వారిని నిర్ధాక్షిణ్యంగా తొల గిస్తు న్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తమ పార్టీలోకి వస్తే యాని మే టర్లుగా కొన సాగిస్తామని లేదంటే ఇంటికి పోవాల్సిందే నంటూ స్థానిక వైసీపీ నాయకులు హుకుం జారీ చేస్తున్నారని యానిమే టర్లు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇదే ఉద్యోగం నమ్ము కుని జీవనం సాగిస్తున్న యానిమేటర్‌ల కుటుంబాలు వీధిన ప డుతున్నాయి.

 ముగ్గురు యానిమేటర్‌ల తొలగింపు.. 

మండల వ్యాప్తంగా ఇప్పటికే ముగ్గురు యానిమేటర్లను తొలగిం చారు. ఎన్నో ఏళ్ళుగా విధులు నిర్వహిస్తున్న తమను తొలగించడం అన్యాయం అం టూ అధికారులు, నాయకులను వేడుకుంటున్నా కణికరం చూపడం లేదంటూ యానిమేటర్లు వాపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాని మేటర్లకు జీతాలు పెంచు తున్నట్లు ప్రకటన తమకు ఊరటనిచ్చిందని తీరా ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నారని అ న్నారు. మండలంలోని కే బ్రాహ్మణపల్లి, యాకాల చెరువుకొత్తపల్లి, కట్ల తండా యానిమేటర్లను తొలగిం చారు. తాజాగా ఎర్రదొడ్డి పంచాయతీ వై కొత్తపల్లి గ్రామ యాని మేటర్‌ను తొలగించాలని గ్రామ సంఘ సమావేశంలో తీర్మానం పెట్టగా అక్కడ మెజార్టీ సభ్యులు దీనిని వ్యతిరేకించడంతో సిబ్బంది వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. నియోజక వర్గంలోని తమ కు అను కూలంగా లేని యానిమేటర్లను తొలగించి తాము చెప్పిన వారిని తీసుకోవాలని స్థానిక రాజకీయ, ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిడి పెంచు తున్నట్లు తెలుస్తోంది. 

 రాజకీయ ఒత్తిళ్ళ ఉన్నాయి.. శారద ఏపీఎం, కదిరి 

మాకు రాజకీయ ఒత్తిళ్లు అయితే ఉన్నాయి. ఏ యానిమేటర్‌ను కూడా ఏకపక్షంగా తొలగించలేదు. గ్రామ సంఘం సమావేశంలో తీర్మానం చేసి మెజార్టీ మేరకు యానిమేటర్‌ను తొల గించాం.

Updated Date - 2021-09-17T06:35:28+05:30 IST