రాజకీయాలు వ్యాపారమయం

ABN , First Publish Date - 2021-02-27T06:07:01+05:30 IST

రాజకీయాలు వ్యాపారమయం

రాజకీయాలు వ్యాపారమయం
సభలో మాట్లాడుతున్న వెంకటేశ్వరరావు

 గన్నవరం, ఫిబ్రవరి 26: రాజకీయాలు వ్యాపార మయంగా మారాయని, విలువలు, సిద్ధాంతాలను ఖూనీ చేసే పనిలో ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వ రరావు అన్నారు. స్థానిక సీపీఎం  కార్యాలయంలో ఇటీ వల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో  గెలిచిన పార్టీ అభ్య ర్థుల అభినందన సభ శుక్రవారం కళ్లం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఎన్నికల్లో బెదిరింపు లు, అధికార, ఆర్థిక బ లాలు పెరిగిపోయా యని చెప్పారు. పంచా యతీ ఎన్నికల్లో ఓటు కు రూ.10వేల వరకూ ఈ మండలంలోనే ఇచ్చారని చెప్పారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని గెలవటం అభినందనీయమన్నా రు. సీపీఎం జిల్లా కార్య దర్శి ఆర్‌.రఘు మాట్లాడుతూ అధికార పార్టీ అభ్యర్థులు లక్షలు గుమ్మరించిన పట్టించుకోకుండా ప్రజలు ఎంతో నమ్మకంతో సీపీఎం బలపరిచిన అభ్యర్ధులను గెలిపించటం గొప్ప విషయమన్నారు. సీపీఎం నాయకులు ఎం.హరి బాబు, వై.నరసింహారావు, సర్పంచ్‌లు బడుగు బాలమ్మ, తెల్లాకుల రామ్మోహనరావు, ఎర్రిబోయిన రంగారావు, ఆర్ధిక విశ్లేషకులు గన్నే వెంకట్రావు, సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T06:07:01+05:30 IST