సమరానికి సై

ABN , First Publish Date - 2022-09-04T06:06:56+05:30 IST

అనుకున్నట్టుగా ఎన్నికలు యధావిధిగా జరిగితే మరో 18 నెలలే గడువు ఉంది.

సమరానికి సై

ప్రజా వ్యతిరేక విధానాలపై సమరభేరి

ఏలూరు జిల్లాలో ఇప్పటికే సైకిల్‌ జోరు

కొన్నిచోట్ల వివాదాలున్నా వాటన్నిటికీ చెక్‌

నూజివీడులో అంతా సెట్‌ రైట్‌

నెలాఖరునాటికి చింతలపూడికి కొత్త సారథి

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) 

అనుకున్నట్టుగా ఎన్నికలు యధావిధిగా జరిగితే మరో 18 నెలలే గడువు ఉంది.కానీ ఇంత స్వల్ప సమయంలోనే టీడీపీ శ్రేణులు సమరానికి సన్నాహాల్లో పడ్డాయి. పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ కీలక సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా శ్రేణులన్నీ ఎలా కదలాలో తేల్చి చెప్పారు. ఇంతకుముందుగా బద్దకంతో వ్యవహరిస్తే ఇక ఇంతే సంగతులని తేల్చే శారు. జనం మధ్య మనం ఉండాలి, జనం అభిమానం పొందడమే కాకుండా జన సమస్యలపై ఎదురేగి పోరా డాలంటూ చేసిన సూచనలు ఇప్పటికే కొన్ని నియోజక వర్గాల్లో కాస్తంత ధైర్యంగానే అమలు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో పార్టీ ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పూర్తిగా బలపడింది. మరికొన్నింటిలో ఆ దిశగా పయ నించేలా రాష్ట్ర, జిల్లా నేతలు ఎప్పటికప్పుడు చొరవ తీసుకుంటున్నారు. ఫ్యాను గాలి పలుచబడి సైకిల్‌ జోరు పెరుగుతున్న క్రమంలో ఇకముందు మరింత ధైర్యంగా ముందుకు కదిలేందుకు తెలుగుదేశం జిల్లా నాయకత్వం సిద్ధపడుతోంది. 

ఇంతకీ అసలేం జరుగుతోంది 

గడిచిన మూడున్నరేళ్లుగా ఒకవైపు కరోనా, మరోవైపు వైసీపీ అరాచకం, ప్రభుత్వ ఒత్తిళ్ళు, అక్రమ కేసులు, బెదిరింపులు అన్నిటికీ తెలుగుదేశం ఎదురీదుతూనే ఉంది. మొదట్లో కాస్త వెనుకంజ వేసినా గడిచిన ఏడా దిన్నరగా కీలక నేతలంతా ధైర్యంగా వీధుల్లోకి వస్తు న్నారు. పార్టీ నేతలందరూ ప్రభుత్వ వ్యతిరేక విధా నాలపై ధైర్యంగానే ఆందోళన చేస్తున్నారు. పోలీసులకు ఎదురొడ్డి, అక్రమ కేసులకు బెదరకుండా ఒకింత సాహ సోపేతంగానే ముందుకువెళ్లే ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఇప్పటికే పార్టీలోను, జిల్లాలోను ఫైర్‌ బ్రాం డ్‌గా ఉన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఈ మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై సీరియస్‌గానే దూకుడు ప్రదర్శిస్తున్నారు. స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు సాధారణ పౌరుడిగా ఫిర్యాదు చేయడం, తన కళ్ళెదుటే రోడ్ల మీద వచ్చీపోయే వారిని ఆపి కాస్తంత భయపెడుతున్న పోలీసులను నిలదీస్తూ పార్టీఇచ్చిన పిలుపు మేరకు ధైర్యంగా కలెక్టరేట్‌ వరకు చొచ్చుకు పోవడం వంటి చర్యల్లో ఆయన ముందున్నారు. మొదటి నుంచి ఒకింత దూకుడుగా కార్యకర్తలకు అండగా ఉండే ఆయన తన నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరికి ధీటుగా తన కేడర్‌ను రాబోయే ఎన్నికలకు సమాయత్తపరుస్తున్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నియోజకవర్గంలోని మిగతా నేతలు ఇప్పుడు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పోలవరం నియోజకవర్గంలో బొరగం శ్రీనివాస్‌ ఈ మధ్య కాలంలో మరింత పుంజుకు న్నారు. ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు వంటి మండలాల్లో వరదలొచ్చినా, నిర్వాసితులు సమస్యలు ఎదుర్కొన్నా తొలుత వాలిపోయేది బొరగమే. అందుకనే ఇప్పుడు ఆయనకు అధిష్ఠానం వద్ద మంచి మార్కులే పడుతున్నాయి. అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న పోలవరం ఎస్టీ రిజర్వుగా ఉన్నప్పటికీ అందరి మద్దతు పొంది నిలదొక్కుకునేందుకు బొరగం శ్రీనివాస్‌ ప్రయత్నిస్తున్నారు. ఏలూరులో బడేటి చంటి తన కేడర్‌ను ఒకవైపు జాగ్రత్త చేసుకుంటూనే మరోవైపు వైసీపీకి ఎదురొడ్డి ముందుకు సాగుతున్నారు. ఇక తమకు తిరుగులేదనుకున్న ఏలూరులో బడేటి చంటి ఇప్పుడు కాస్తంత దూకుడు ప్రదర్శించడం వైసీపీ నేతలే ఊహించలేకపోయారు. గడిచిన ఆరునెలలుగా ఆయన వినూత్నంగా ఏలూరులో నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ దాదాపు సక్సెస్‌ అయ్యాయి. మిగతా జిల్లా నేతలతోనూ ఆయన సయోధ్య కొనసాగించడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు సైతం ఈ మధ్య కాలంలో వేగంగా పుంజుకున్నారు. ప్రత్యర్థి వైసీపీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సర్వేల్లో మైనస్‌ కావడంతో ఇక్కడ తెలుగుదేశం శ్రేణులకు మంచి జోష్‌ వచ్చింది. కీలక మండలాల్లో సైకిల్‌ జోరు పెరిగింది. 

ఆ రెండింటిలోనూ ఇప్పుడు ఓకే 

ఒకప్పుడు నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల్లోని తెలుగు దేశం పార్టీలో ఒకింత వివాదాలు చోటు చేసుకున్నాయి. నూజివీడులో ఈ మధ్యకాలంలోనే పార్టీ టికెట్‌ పొందే క్రమంలో కొందరు ఏకపక్షంగా వ్యవహరించడం, మరి కొందరు పార్టీ వైఖరికి భిన్నంగా క్రమశిక్షణను ఉల్లంఘించడం వంటి చర్యలు చోటు చేసుకుంటూ వచ్చాయి. అయితే నూజివీడు  నియోజకవర్గంలో ఈ పరిస్థితిని ఈమధ్యనే పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్ళింది. ‘పార్టీ నిర్ణయం ప్రకారం అందరూ వెళ్లాలి. ఎవరంతటి వారుగా వెళ్ళడం కుదరదు. పార్టీ ప్రోగ్రాం ఇచ్చిందంటే అందరూ అందుకు కట్టబడాల్సిందే. పార్టీ ఏకతాటి మీదకు వెళ్ళి తీరాల్సిందే’ అంటూ స్పష్టమైన సంకేతాలు పంపారు. దీంతో ఈ మధ్య కాలంలో కాపా శ్రీనివాస్‌గాని, పర్వతనేని గంగాధర్‌ విషయంలోను పార్టీ ఆచి తూచి వ్యవహరిస్తూనే అంతా ఉమ్మడిగా సాగాల్సిందే అనే సంకే తాలను నేరుగానే పంపింది. నూజివీడులో బీసీ నేతగా ముద్దర బోయిన వెంకటేశ్వర రావు పార్టీకి నాయకత్వం వహి స్తున్నారు. ఈ దశలో కొందరు వేరే రకంగా వ్యవహరిస్తే ప్రజలకు ఆ తరహాలోనే సంకేతాలు వెళ్తాయనే దృష్టితోనే పార్టీ అధినేత నేరుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్నిని అప్రమత్తం చేశారు. వివాదాలకు తావులేకుండా చూడాల్సిందిగా ఆదేశించారు. అలాగే కైకలూరు నియోజక వర్గంలో కొంతకాలం పాటు పార్టీ కార్యక్ర మాలు పూర్తిగా వెను కంజ వేయగా, ఇప్పుడు మాత్రం కొంత కదలిక వచ్చింది. పార్టీ కన్వీనర్‌ వెంకటరమణ కాస్తంత తేరుకుని వివిధ మండలాల్లో పార్టీ నేతలను కలుపుకుని ముందుకు సాగు తున్నారు. దీంతో నూజివీడు, కైకలూరుల్లో తెలుగుదేశం జోరు పెరిగినట్టయ్యింది.

జిల్లా పార్టీది ఫస్ట్‌ ర్యాంకే 

ఏలూరు జిల్లా పార్టీ నాయకత్వానికి అధిష్ఠానం మంచి మార్కులే వేస్తుంది.బాదుడే బాదుడు దగ్గర నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చేపట్టే ఆందోళనల్లో రాష్ట్రంలోనే తొలి వరుసలో నిలిచింది. ఎప్పటికప్పుడు అధిష్ఠానం సైతం పార్టీ కార్యక్రమాల అమలు, ప్రజలకు చేరువకావడం, ఆకర్షణీయమైన ఆందోళనలు చేయడం, ప్రజాభిమానంతో ముందుకు సాగడం వంటి పరిణా మాలను పరిగణనలోకి తీసుకుంటున్నది. ఇప్పుడు ఈ దిశగానే ఈ మధ్యన పార్టీ అంచనాల్లో ఏలూరు జిల్లాకు దాదాపు తొలి స్థానమే దక్కింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు సైతం చురుగ్గా సాగుతూనే ఉన్నారు.ఇదే క్రమంలో చాన్నాళ్ళుగా చింతలపూడి నియోజకవర్గానికి కన్వీనర్‌ను నియమించలేక పార్టీ పదేపదే సమావేశాలు నిర్వహిస్తున్నా ఇప్పటికీ ఆ విషయంలో సక్సెస్‌ కాలేకపోయారు. అయితే ఈ నెలాఖరునాటికల్లా చింతలపూడి నాయకత్వ బాధ్యతలు చేపట్టే వారిపై కీలక ప్రకటన చేయనున్నారు. పోలవరం ఎస్టీ రిజర్వుడు, చింతలపూడి ఎస్సీ రిజర్వుడు కాగా నూజివీడు, కైకలూరు నుంచి పార్టీ కన్వీనర్లుగా బీసీ నేతలు ఉండడం మిగతా నియోజకవర్గాల్లో సామాజిక దమాషా పద్ధతిని పాటించడంతో ఏలూరు జిల్లాపై అధిష్టానం దీనిపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా ఇప్పటికే మండల కమిటీలు పూర్తికాగా ఇకముందు నియోజకవర్గ స్థాయి త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారు.


Updated Date - 2022-09-04T06:06:56+05:30 IST