Abn logo
Sep 25 2020 @ 16:16PM

ఎస్పీ బాలు మృతిపై రాజకీయ ప్రముఖుల సంతాపం

Kaakateeya

అమరావతి: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అకాల మృతిపై పలువరు రాజకీయ ప్రముఖుుల సంతాపం తెలిపారు. బాలు లేని లోటు సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు తీరని లోటని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎస్పీ బాలు అమృత కంఠం మూగబోయిందని బీజేపీ నేత జీవీఎల్ అన్నారు. సంగీతానికి ఎస్పీ బాలు మూల స్తంభం లాంటివారని మాజీ మంత్రి గంటా వెంకట్రావు కొనియాడారు. బాలు మృతి భారతీయ సినీ లోకానికి తీరని లోటని టీడీపీ నేత కళా వెంకట్రావు చెప్పారు. సంగీత ప్రపంచంలో బాలు ప్రస్థానం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని మంత్రి సురేష్‌ కొనియాడారు. యావత్ భారతావనిని తన గానామృతంతో మైమరపింపజేశారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసించారు. ఎస్పీ బాలు పాట‌, మాట‌, న‌ట‌న‌, సంగీతం చిర‌కాలం జీవించే ఉంటాయని టీడీపీ నేత నారా లోకేష్ చెప్పారు. ఎస్పీ బాలు మృతి పట్ల మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి  సంతాపం తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement