జనాభా ప్రాతిపదికన రాజకీయ పరిపాలన జరగాలి

ABN , First Publish Date - 2022-05-16T06:21:24+05:30 IST

జనాభా ప్రాతిపదికన రాజకీయ పరిపాలన జరగాలని, తద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రజాస్వామ్య ఫోరం కన్వీనర్‌, విశ్రాంత ఐఏఎస్‌ చొ ల్లేటి ప్రభాకర్‌ అన్నారు.

జనాభా ప్రాతిపదికన  రాజకీయ పరిపాలన జరగాలి
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభాకర్‌

ప్రజాస్వామ్య ఫోరం కన్వీనర్‌, విశ్రాంత ఐఏఎస్‌ చొల్లేటి ప్రభాకర్‌

చిట్యాలరూరల్‌, మే 15: జనాభా ప్రాతిపదికన రాజకీయ పరిపాలన జరగాలని, తద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రజాస్వామ్య ఫోరం కన్వీనర్‌, విశ్రాంత ఐఏఎస్‌ చొ ల్లేటి ప్రభాకర్‌ అన్నారు. ప్రజాస్వామ్య ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన బీసీల రా జ్యాధికార సాధన పాదయాత్ర ఆదివారం చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి, వెలిమినేడు, గుండ్రాంపల్లిలో సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మె జారిటీ జనాభాగా ఉన్న బీసీలు రాజకీయంగా చివరిస్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. ఓట్లు మావి సీట్లు ఉన్నత వర్గాలకు చెందిన వారివని అన్నారు. ఇదేనా సామాజిక న్యాయమని ఆయన ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలు, షెడ్యూల్డ్‌ కులాలు, జాతులు, మైనార్టీల జనాభా అధిక శాతం ఉన్నా భారత ప్రజాస్వామ్యం కొన్ని సామాజిక వర్గాల చేతుల్లో బందీగా మారిందని, దానికి విముక్తి కల్పించాల్సిన అన్నారు. ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురికాకుండా మన ఓట్లు మనమే వేసుకుంటే విజయమెవరిదో తెలుస్తుందని, బీసీలకు రాజ్యాధికారంతోనే న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌, బొడ్డు హరినాథ్‌యాదవ్‌, రాజశేఖర్‌, లింగయ్య, రమేష్‌, రాము, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-16T06:21:24+05:30 IST