ప్రియమైన వారికి ఆర్థిక బహుమతి

ABN , First Publish Date - 2020-11-29T07:03:52+05:30 IST

మీ ప్రియమైన వారికి పనికొచ్చే బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా..? అది కేవలం వస్తువే కానక్కర్లేదు. కంపెనీల షేర్ల్లు, మ్యూచు వల్‌ ఫండ్లు, ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు (ఈటీఎఫ్‌), గోల్డ్‌ బాండ్లనూ బహుమానంగా అందించవచ్చు...

ప్రియమైన వారికి ఆర్థిక బహుమతి

  • షేర్లు, ఈటీఎ్‌ఫలు, మ్యూచువల్‌ ఫండ్లు,
  • గోల్డ్‌ బాండ్లనూ గిఫ్ట్‌గా అందించవచ్చు.. 

మీ ప్రియమైన వారికి పనికొచ్చే బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా..? అది కేవలం వస్తువే కానక్కర్లేదు. కంపెనీల షేర్ల్లు, మ్యూచు వల్‌ ఫండ్లు, ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు (ఈటీఎఫ్‌), గోల్డ్‌ బాండ్లనూ బహుమానంగా అందించవచ్చు. పైగా కుటుంబ సభ్యులు, బంధువులకిచ్చే ఆర్థిక బహుమతులు వ్యక్తిగత ఆదాయ పన్ను పరిధిలోకి రావు. బంధువులు కాని వ్యక్తులకిచ్చే బహుమతి విలువ రూ.50,000కు మించితే మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 


షేర్లు, స్టాక్‌ ఈటీఎఫ్‌ 

ఈక్విటీ షేర్లను మీ ప్రియమైన వారి డీమ్యాట్‌ అకౌంట్‌కు నేరుగా బదిలీ చేయవచ్చు. ఇందుకోసం దాత డెలివరీ ఇన్‌స్ట్రక్షన్‌ స్లిప్‌ (డీఐఎ్‌స)ను నింపి తమ డిపాజిటరీ పార్టిసిపెంట్‌ (డీపీ)కు సమర్పించాలి. డీఐఎ్‌సలో దాత, బహుమతి స్వీకర్తల పేర్లతో పాటు వారిద్దరి డీపీ ఐడీలు, క్లయింట్‌ ఐటీ, బదిలీ చేయాల్సిన షేర్లు, బదిలీ చేయాల్సిన తేదీ వివరాలుంటాయి. డీఐఎస్‌ సమర్పించాక, మీరు నిర్దేశించిన తేదీన  బహుమతి స్వీకర్త డీపీకి షేర్ల బదిలీ జరుగుతుంది. ఆ తర్వాత బహుమతి స్వీకర్త రెసిపియెంట్‌ ఇన్‌స్ట్రక్షన్‌ స్లిప్‌ను నింపి, తన డీపీకి సమర్పించాలి. అప్పుడే స్వీకర్త డీమ్యాట్‌ ఖాతాలోకి షేర్లు బదిలీ అవుతాయి. అయితే, బహుమతిని అధికారికంగా ధ్రువీకరించేందుకు దాతలు గిఫ్ట్‌ డీడ్‌ తయారు చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఐటీ రిటర్నులు సమర్పించే సమయంలో పనికొస్తుంది. 


మ్యూచువల్‌ ఫండ్లు 

వీటిని బహుమతిగా ఇవ్వడం కొంత క్లిష్టమైన ప్రక్రియే. చాలావరకు మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో థర్డ్‌పార్టీ ద్వారా పెట్టుబడి లేదా చెల్లింపులు (ఒకేసారి లేదా సిప్‌) సాధ్యపడదు. ఒకవేళ మైనర్‌ కోసం మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నట్లయితే, ఆ మైనర్‌ తల్లి లేదా తండ్రి లేదా అధికారిక సంరక్షకుడి లేదా సంరక్షకురాలు బ్యాంక్‌ ఖాతా వివరాలు అవసరం. హెచ్‌డీఎ్‌ఫసీ చిల్డ్రన్స్‌ గిఫ్ట్‌ ఫండ్‌, ఐసీఐసీఐ ప్రు చైల్డ్‌ కేర్‌ ఫండ్‌ వంటి పథకాలు మాత్రం థర్డ్‌పార్టీ నుంచి పెట్టుబడులు లేదా చెల్లింపులను అనుమతిస్తున్నాయి.


గోల్డ్‌ బాండ్లు 

బంగారాన్ని డిజిటల్‌ రూపకంగానూ బహుమతిగా అందించవచ్చు. నిర్దిష్ట సమయాల్లో ఆర్‌బీ జారీ చేసే ప్రభుత్వ పసిడి బాండ్లు ఇందుకు మంచి ప్రత్యామ్నాయం. కనీసం ఒక గ్రాము (యూనిట్‌) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్‌ రూపంలో ఆర్‌బీఐ వీటిని జారీ చేస్తుంది. మీరు బహుమతి అందించాలనుకునే వారి పేరు మీద మీరు ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. లేదంటే డిజిటల్‌ రూపకంగా బంగారం కొనుగోలు చేసేందుకు అనేక వేదికలు అవకాశం కల్పిస్తున్నాయి. వీటి ద్వారానూ డిజిటల్‌ గోల్డ్‌ను గిఫ్ట్‌గా అందించవచ్చు. 


లాంగ్‌టర్మ్‌ బాండ్లు 

మీ ప్రియమైన వారి పేరు మీద దీర్ఘకాలిక పెట్టుబడి బాండ్లు, సెక్యూర్డ్‌ ట్రెజరీ బాండ్లు లేదా భారత్‌ బాండ్‌ ఈటీఎ్‌ఫను కొనుగోలు చేయవచ్చు. 


సుకన్య సమృద్ధి పథకం

మీకు అమ్మాయి ఉంటే, సుకన్య సమృద్ధి పథకంలో పెట్టుబడులు మీరు తనకిచ్చే అత్యుత్తమ ఆర్థిక బహుమతుల్లో ఒకటవుతుంది. పన్ను రహిత రిటర్నులు అందించే ఈ పథకంలో ఏటా రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. 



పీపీఎఫ్‌ 

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) పన్ను రహిత రిటర్నులు అందించే దీర్ఘకాలిక పెట్టుబడి సాధనం. అంతేకాదు, పీపీఎఫ్‌ పెట్టుబడులపై ఐటీ చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద పన్ను రాయితీ కూడా పొందవచ్చు. మీ పిల్లలకు మైనర్‌ పీపీఎఫ్‌ అకౌంట్‌ను బహుమతిగా అందించవచ్చు. ఈ ఖాతాలో జమ చేసే సొమ్ము భవిష్యత్‌లో వారి ఉన్నత విద్య. పెళ్లి ఖర్చులకు పనికివస్తుంది.  


Updated Date - 2020-11-29T07:03:52+05:30 IST