ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-10-22T04:10:57+05:30 IST

ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వ ర్తిస్తున్న పోలీసులు అని ఏఎస్పీ అనోన్య అన్నారు.

ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు
కామారెడ్డిలో పోలీసు అమరవీరులకు నివాళ్లు అర్పిస్తున్న ఏఎస్పీ అనోన్య

కామారెడ్డి, అక్టోబరు 21: ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వ ర్తిస్తున్న పోలీసులు అని ఏఎస్పీ అనోన్య అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నూతన ఎస్పీ కార్యాలయంలో పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనం గా నిర్వహించారు. పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంత రం అమరవీరుల కుటుంబాలను సన్మానించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేలుకొని శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారన్నారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగలను కూడా త్యజించి ప్రజల క్షేమం కోసం జీవించి మరణించేది పోలీసులేనని అన్నారు. అందులో వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసులు చేసే త్యాగాలకు వెల కట్టలేమని అన్నారు. సానుభూతి, గౌరవం చూపించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. పోలీసులుగా బాధ్యతలు నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని స్ఫూర్తిని నింపడమే ఈ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను త్యజించిన వారికి ప్రతీ ఒక్క రు నివాళ్లు అర్పించాలని అన్నారు. పోలీసులు చేసిన త్యాగాలను స్మరించుకునేందుకు అమరవీరుల దినోత్సవం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం రెడ్‌క్రాస్‌ సొసైటీ వారి సహకారంతో జిల్లా కేంద్రంలో 100 మంది రక్తదానం చేసిన ట్లు తెలిపారు. వారిలో ఆర్‌కే డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. అమరవీరుల కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించి మేము ఉన్నామంటూ వారికి జ్ఞాపికలను అందజేశారు. పోలీసుశాఖ ఎల్లప్పుడు సహాయకారిగా ఉంటుం దని భరోసా కల్పించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్‌ల పరిధిలో ర్యాలీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ సోమనాథం, సీఐ మధుసూదన్‌, ఆర్‌కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ జైపాల్‌రెడ్డి, దత్తురావు, గురువేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమరుల త్యాగాలు మరువలేనివి
 బిచ్కుంద:  విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలు మరువలేనివని బిచ్కుం ద సీఐ శోభన్‌ అన్నారు. గురువారం పోలీసు అమరవీరులకు బిచ్కుం ద సీఐ, ఎస్‌ఐ పోలీసు సిబ్బంది నివాళ్లు అర్పించి మౌనం పాటించారు. ప్రధాన విధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ ప్రజలకు రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. సర్కిల్‌ పరిధిలోని అన్ని మండలాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో దొంగతనాలను అరికడుతూ ఇతర కేసులను సైతం పుటేజ్‌ల ఆధారంగా ఛేదించడం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సత్యనారాయణ, ఏఎస్‌ఐ వెంకట్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో కొవ్వొత్తుల ర్యాలీ
ఎల్లారెడ్డి : పట్టణ కేంద్రంలో డీఎస్పీ శశాంక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎల్లా రెడ్డి పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో సీఐ రాజశేఖర్‌, ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి, కానిస్టేబుళ్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T04:10:57+05:30 IST