Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోలీసు అమరవీరుల త్యాగాలు అందరికీ ఆదర్శం

 డీఎస్పీ ప్రసాద్‌

కావలి రూరల్‌, అక్టోబరు21: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని, అందరికీ ఆదర్శమని డీఎస్పీ డీ ప్రసాద్‌ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం కావలిలోని పెండెం సెంటర్‌ నుంచి ఉదయగిరి బ్రిడ్జి కూడలి వరకు  నిర్వహించన కొవ్వొత్తుల ర్యాలీని డీఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించి అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివన్నారు. వారంపాటు పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వన్‌టౌన్‌, టూటౌన్‌, రూరల్‌ సీఐలు శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, ఖాజావలి తదితరులతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


Advertisement
Advertisement