పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ

ABN , First Publish Date - 2020-11-25T05:14:27+05:30 IST

పోలీసు కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ అమిత్‌బర్దర్‌ వెల్లడించారు. ఇటీ వల ఏఆర్‌ ఎస్‌ఐ బి.శంకరరావు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన భార్య అనూరాధకు పోలీసు భద్రత నిధి నుంచి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును ఎస్పీ మంగళవారం అందజేశారు.

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ
పోలీసు కుటుంబానికి చెక్కును అందజేస్తున్న ఎస్పీ


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, నవంబరు 24: పోలీసు కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ అమిత్‌బర్దర్‌ వెల్లడించారు. ఇటీ వల ఏఆర్‌ ఎస్‌ఐ బి.శంకరరావు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన భార్య అనూరాధకు పోలీసు భద్రత నిధి నుంచి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును ఎస్పీ మంగళవారం అందజేశారు. అదే విధంగా ఎచ్చెర్లలో ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పాపారావు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన సతీమణి పద్మావతికి రూ.21.65లక్షల చెక్కును ఎస్పీ అందజేశారు.  అర్హత గల కుటుంబ సభ్యునికి ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.


ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి: ఏఎస్పీ విఠలేశ్వరరావు

గుజరాతీపేట: ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు కోరారు. మంగళవారం నిర్వహించిన ట్రాఫిక్‌ అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని వ్యాపారులకు  కూడా ట్రాఫిక్‌పై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. పలు కూడళ్లలో తోపుడు బండ్లు, ఇతర దుకాణాల కారణంగా ట్రాఫిక్‌కు  తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు. సెంటర్‌ పార్కింగ్‌ ఉన్నా జీటీ రోడ్డులో షాపుల ముందు వాహనాలను నిలిపివేస్తున్నారని తెలిపారు.  సంక్రాంతి  సీజన్‌లో మరింత ట్రాఫిక్‌ పెరిగే అవకాశం ఉందని, ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ప్రసాదరావు, మహేంద్రముని పాల్గొన్నారు.


మద్యంతో జీవితం నాశనం చేసుకోవద్దు: ఏఎస్పీ శ్రీనివాసరావు

ఇచ్ఛాపురం/ రూరల్‌ : మద్యం, మాదకద్రవ్యాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దని, మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏఎస్పీ కె.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం డొంకూరులో కార్డెన్‌సెర్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి పోలీసులు వెళ్లి తనిఖీచేశారు. ఒడిశా నుంచి సముద్రమార్గంలో బోట్లపై సారా రవాణా చేసి ఇక్కడ విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ వినోద్‌బాబు, శ్రీనివాసరావు, ఎస్‌ఈబీ సీఐలు డీవీ మురళీధర్‌, ఎస్‌.ధర్మారావు, ఎస్‌ఐలు కె.లక్ష్మి, వాసునారాయణ పాల్గొన్నారు.ఫ పురపాలక సంఘం పరిధిలోని ఏఎస్‌పేట (బోర్డర్‌)లో ఎస్‌ఈబీ, పట్టణ పోలీసులు సంయుక్తంగా కార్డెన్‌ సెర్చ్‌  నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసరావు   మాట్లాడుతూ  మద్యం  అక్రమంగా రవాణా చేసినా, నిల్వఉంచినా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఈబీ సీఐలు  టీవీ అప్పలనాయుడు, జనార్దనరావు, ఎస్‌ఐ పి.జాన్‌ ప్రసాద్‌, సత్యనారాయణ పాల్గొన్నారు. 


  శాంతిభద్రతలు పరిరక్షిస్తాం: డీఎస్పీ శ్రావణి

పాలకొండ: గ్రామ సచివాలయ పోలీసులు వారి పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డీఎస్పీ ఎం.శ్రావణి తెలిపారు. మంగళవారం పాలకొండ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో పాలకొండ, వీరఘట్టం, రేగిడి మండలాల సచివాలయాల మహిళా పోలీసులతో సమావేశం  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజకీయాలతో సంబంధం లేకుండా సమష్టి కృషితో పనిచేయాలన్నారు. ప్రజలు సత్‌ప్రవర్తనతో మెల గాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక పనులను అరికట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో  సీఐ శంకరరావు, పాలకొండ, వీర ఘట్టం, ఎస్‌ఐలు జనార్దన్‌రావు, భాస్కరరావు పాల్గొన్నారు. 



Updated Date - 2020-11-25T05:14:27+05:30 IST