Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాత్రికి రాత్రే ట్యాంకర్లలోంచి 3000 లీటర్ల డీజిల్ మాయం.. సీసీ కెమెరాలను చెక్ చేస్తే..

కొన్నిసార్లు చోరీలు జరిగే తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. చివరకు పోలీసులు కూడా అవాక్కయ్యేలా దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో చాలా కేసుల్లో దొంగలు ఈజీగా దొరికిపోతున్నారు. అయితే కొందరిని చూస్తే చాలా హుందాగా కనిపిస్తుంటారు. తీరా చోరీ జరిగాక కానీ వారు దొంగలు అనే విషయం తెలీదు. అలాంటి చోరీనే రాజస్థాన్‌లో జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్యాంకర్లలోని 3000 లీటర్ల డీజిల్‌ని రాత్రికి రాత్రే మాయం చేశారు.  సీసీ కెమెరాలు చెక్ చేసిన పోలీసులు షాక్ అయ్యారు..

రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని మండల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై వాహనాలను ఎక్కువగా నిలుపుతుంటారు. మంగళవారం రాత్రి స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్ పంపు వద్ద రోడ్డు పక్కన 17 ట్రక్కులను నిలిపి ఉంచారు. అయితే పొద్దున చూసేసరికి లారీల్లోని 3000 లీటర్ల డీజిల్ మాయమైంది. అవాక్కైన వాహనదారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే వారికి అక్కడ ఎలాంటి క్లూ లభించలేదు. చివరగా సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు.

15 రోజుల క్రితం పెళ్లి.. గంటల తరబడి చాటుగా భార్య ఫోన్ కాల్స్.. నిఘా వేసి భర్త ఇచ్చిన ట్విస్ట్‌తో ఆమెకు మైండ్‌బ్లాంక్..!

సీసీ కెమెరాల్లో ఫుటేజీ చూసిన పోలీసులు అవాక్కయ్యారు. దొంగల తెలివితేటలు చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా దొంగలు.. లగ్జరీ కార్లలో వచ్చారు. కొన్ని గంటల సమయంలోనే దర్జాగా 17ట్రక్కుల్లోని డీజిల్‌ను బయటికి తీశారు. పాల ట్యాంక్లర్లు, ట్రక్కులు తదితర వాహనాల నుంచి డీజిల్‌ను అపహరించినట్లు గుర్తించారు. పెట్రోల్ బంక్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

18 ఏళ్ల కూతురు కనిపించడం లేదంటూ ఓ తండ్రి ఫిర్యాదు.. పోలీసులు చెప్పింది విని అంతా షాక్.. మరో యువతితో కలిసి..

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement