Jharkhand Assembly: బీజేపీ నేతల నిరసన ఉద్రిక్తం

ABN , First Publish Date - 2021-09-08T22:27:41+05:30 IST

స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, నమాజ్‌కు గదిని కేటాయిస్తే తమకు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి కూడా గదిని కేటాయించాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సోమవారం స్పీకర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు

Jharkhand Assembly: బీజేపీ నేతల నిరసన ఉద్రిక్తం

రాంచీ: జర్ఖండ్ అసెంబ్లీలో నమాజ్ కోసం గదిని కేటాయించడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అయితే నిరసనకారులను చెదరగొట్టడానికి బీజేపీ నేతలు, కార్యకర్తలపై జార్ఖండ్ పోలీసులు వాటర్ కెనాన్ ప్రయోగించారు. పోలీసుల బలప్రయోగాన్ని దాటుకొని అసెంబ్లీ ముందే బైఠాయించి నిరసన చెపట్టారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద బైఠాయించిన బీజేపీ ఎమ్మెల్యేలు హనుమాన్ చాలీసా చదువుతూ నిరసన వ్యక్తం చేశారు. టీడబ్ల్యూ 348 అనే గదిని నమాజ్ చేసుకునేందుకు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ రవీంద్ర నాత్ మహ్తో ప్రకటించడంతో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.


స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, నమాజ్‌కు గదిని కేటాయిస్తే తమకు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి కూడా గదిని కేటాయించాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సోమవారం స్పీకర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ‘జై శ్రీరాం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సోమవారం నుంచి కొనసాగుతున్న ఈ నిరసన బుధవారం నాటికి అసెంబ్లీ ముట్టడి వరకు చేరింది.

Updated Date - 2021-09-08T22:27:41+05:30 IST