నైట్‌.. అక్కడ రెడ్‌ లైట్‌..!

ABN , First Publish Date - 2021-10-27T18:29:37+05:30 IST

వనస్థలిపురం, మీర్‌పేట్‌ పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న బహిరంగా ప్రాంతాలపై పోలీసుల నిఘా లోపించింది. దాంతో రాత్రి అయిందంటే చాలు అక్కడ అసాంఘిక కార్యక్రమాలు

నైట్‌.. అక్కడ రెడ్‌ లైట్‌..!

హైవే పక్కన ఆసాంఘిక దందా

సాగర్‌ కాంప్లెక్స్‌ వద్ద యథేచ్ఛగా వ్యభిచారం 

పట్టించుకోని పోలీసులు


హైదరాబాద్/సరూర్‌నగర్‌: వనస్థలిపురం, మీర్‌పేట్‌ పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న బహిరంగా ప్రాంతాలపై పోలీసుల నిఘా లోపించింది. దాంతో రాత్రి అయిందంటే చాలు అక్కడ అసాంఘిక కార్యక్రమాలు నడుస్తోన్నాయి. ఇక్కడి పరిస్థితి ‘అంధేరి రాత్‌’ అన్నట్టుగా తయారైంది. ఇది నాగార్జున సాగర్‌ జాతీయ రహదారిని అనుకున్న ఉన్న బీఎన్‌రెడ్డి నగర్‌ సమీపంలోని సాగర్‌ కాంప్లెక్స్‌ వద్ద ప్రతి రోజు రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ బహిరంగంగా వ్యభిచారం జరుగుతోంది. ఒక రకంగా ఆ ప్రాంతం అంతా రెడ్‌ లైట్‌ ఏరియాను తలపిస్తోంది. ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, వనస్థలిపురం, మీర్‌పేట్‌ పీఎ్‌సలకు చెందిన పోలీస్‌ ఉన్నతాధికారులు, సిబ్బంది ప్రతి రోజూ ఇదే రహదారిలో ప్రయాణిస్తున్నా.. పట్టించుకోకపోవడం దారుణమని పలువురు విమర్శిస్తోన్నారు.


తలదించుకుని వెళ్తున్న కుటుంబాలు

జాతీయ రహదారి కావడంతో నిత్యం వేలాది వాహనాలు, లక్షలాది ప్రయాణికులు రాకపోకులు సాగిస్తోన్నారు. అలాంటి రహదారిపై సాగర్‌ కాంప్లెక్స్‌ వద్ద ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ యూ-టర్న్‌ నుంచి టీఎ్‌సఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌ వరకు గల ప్రాంతాన్ని కొందరు ‘రెడ్‌ లైట్‌ ఏరియా’గా మార్చేశారు. సాయంత్రం ఏడు దాటిందంటే అక్కడ గుంపులు గుంపులుగా (వ్యభిచారిణిలు) అసభ్యకరమైన హావభావాలతో తిరుగుతూ విటులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పలువురు విటులు సాయంత్రం ఆ ప్రాంతానికి చేరుకోవడంతో తరచూ అక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఇక కార్లు, ద్విచక్ర వాహనాలల్లో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లే వారు అక్కడికి రాగానే తలదించుకోవాల్సిన పరిస్థితి. 


వెలగని వీధి లైట్లు

సరిగ్గా అదే ప్రాంతంలో హైవేలోని స్ట్రీట్‌ లైట్లు వెలగక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల వినాయక చవితి సందర్భంగా లైట్లు బాగు చేసినప్పటికీ, పది రోజుల పాటు మాత్రమే పనిచేశాయి. టీఎ్‌సఆర్‌ కన్వెన్షన్‌ నుంచి ఫ్లైటెక్‌ యూ-టర్న్‌ వరకు అంథకారం నెలకొంది. వ్యభిచారిణిల మధ్య పోటీ ఏర్పడడంతో కొందరు ఇంజాపూర్‌-గుర్రంగూడ మలుపు వద్ద గల ప్రాం తాన్ని అడ్డాగా మార్చుకుని తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అధికారులు స్పం దించి హైవేలోని ఈ వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-27T18:29:37+05:30 IST