గుంటూరు : ముప్పాళ్ల పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం మృతదేహంతో కొందరు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బాజీ అనే వ్యక్తి గురువారం ఆఫ్రీద్ (15) అనే బాలుడిని కత్తితో పొడిచి చంపాడు. తన తమ్ముడు కొడుకును చెడు వ్యసనాలకు అలవాటు చేస్తున్నడని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు బాజీని అదుపులోకి తీసుకున్నారు. అయితే బాజీని తమకు అప్పగించాలని ఆఫ్రీద్ బంధువులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. దీంతో సత్తెనపల్లి -నరసరావుపేట మార్గంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.