పోలీస్‌ స్టిక్కర్లకు చెక్‌

ABN , First Publish Date - 2021-10-08T05:28:33+05:30 IST

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి పలు కీలక నిర్ణయా లు తీసుకుంటున్నారు.

పోలీస్‌ స్టిక్కర్లకు చెక్‌
పేరుతో ఉన్న స్టిక్కర్‌ను తొలగిస్తున్న పోలీసులు

వరంగల్‌ క్రైం, అక్టోబరు 7: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి పలు కీలక నిర్ణయా లు తీసుకుంటున్నారు. పలు సంస్కరణలు తన శాఖ నుంచి మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం పోలీస్‌శాఖకు కేటాయించిన వాహనాలకు మినహాయించి సొంత వాహనాల పై పోలీసులు ఎవరూ ‘పోలీస్‌’ పేరిట స్టిక్కర్లు అంటించడం, రాయడంపై సీపీ నిషేధం విధించారు. దీనికితోడు వాహనాల కు నెంబర్‌ ప్లేట్‌ తప్పనిసరిగా అమర్చుకోవాలని ఆదేశించిన ట్లు చేసినట్టు సమాచారం. టూ వీలర్స్‌ కలిగిన ఉన్న పోలీసు లు ఖచ్చితంగా హెల్మెట్‌ ధరించాలని నిబంధన విధించారు. యూనిఫాం ధరించినప్పుడు మాత్రం తప్పనిసరిగా హెల్మెట్‌ ఉండాలని, ట్రాఫిక్‌ విధులు నిర్వహించే పోలీసులు సైతం హెల్మెట్‌ ధరించాలని పేర్కొన్నారు. ఈ మేరకు రె ండు రోజు లుగా నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తు న్నారు. పోలీస్‌ అనే పేరుతో ఉన్న వాహనాలను ఆపేసి తొల గిస్తున్నారు. ఆదేశాలు పాటించని వారికి జరిమానాలు సైతం విధిస్తున్నారు. అంతేకాదు స్టిక్కర్లు ఉన్న వాహనాలను కమిష నరేట్‌లోకి అనుమతించడం లేదు. 

దీంతో కొంతమంది పోలీసులు కమిషరేట్‌ కార్యాలయం బయటే వాహనాలు పార్క్‌ చేసి లోపలికి వెళ్లడం షురూ చేశారు. ఈ విషయాన్ని గమనించిన అధికారులు వారిని సీరి యస్‌గా హెచ్చరించినట్లు తెలిసింది. 

గతం కంటే భిన్నంగా..

గతంలో ఇక్కడ పనిచేసిన సీపీలు, ఎస్పీలు టూ వీలర్‌ కలిగిన పోలీసులు ఖచ్చితంగా హెల్మెట్‌ ధరించాలనే నిబంధన విఽధించారు. ప్రధాన కూడళ్లలో హెల్మెట్‌ ఽధారణపై అవగాహన కల్పిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాతల సహాయంతో ట్రాఫిక్‌ విభాగంలోని పోలీసులకు హెల్మెట్లు కూడా పంపిణీ చే శారు.  కొంతకాలం తర్వాత మళ్లీ యథాస్థితికి వచ్చింది. ఈ అంశాలపై సీపీ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. సొంత వాహనాలపై పోలీస్‌ పేరిట ఎలాంటి స్టిక్కర్లు, గుర్తులు ఉండొద్దని, ఎవరికీ వారే వాటిని తొలగించుకోవాలని హెచ్చరిక లు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.  ఈ ప్రయోగం సక్సెస్‌ అయ్యాక అన్నిశాఖలు, ప్రజలపై దృష్టిసారించే అవకాశముందని సమాచారం.


Updated Date - 2021-10-08T05:28:33+05:30 IST