Abn logo
Sep 24 2021 @ 22:46PM

పోలీస్‌స్టేషన్‌ ఎదుల దళితుల ధర్నా

పోలీస్‌ స్టేషన్‌ వద్ద ధర్నా చేస్తున్న దళిత నేతలు

బిట్రిగుంట, సెప్టెంబరు 24: తప్పు చేసిన వారు ఏ కులానికి చెందిన వారైనా శిక్షించాలని కోరడంలో తప్పులేదని,  కానీ కులం పేరుతో ధూషించడం సరికాదని అంబేద్కర్‌ సేవాదళ్‌ వ్యవస్థాపకుడు బత్తుల రవిచంద్ర, అంబేద్కర్‌ ఇండియా మిషన్‌ కావలి డివిజన్‌ కన్వీనర్‌ సింహాద్రిరావు అన్నారు. బోగోలు మండలం తిప్ప పోలీస్‌ స్టేషన్లో ఎస్సై వెంకట రమణను కులం పేరుతో ధూషించిన బాలకృష్ణ, అతని అనుచర్లపై చర్యలు చేపట్టాలని పోలీసులకు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు అమలకుమార్‌, కాకి తిరుపతి, నరేష్‌, నజీర్‌, జానీ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.