దుబాయ్ నుంచి వచ్చిన యువకుడి హత్య.. 3 నెలలుగా హంతకుడెవరో తెలియక తలలుపట్టుకున్న పోలీసులు.. ఇంతలో..

ABN , First Publish Date - 2022-06-03T09:31:17+05:30 IST

దుబాయ్‌ దేశానికి ఉద్యోగ రీత్యా వెళ్లిన ఒక యువకుడు గత ఫిబ్రవరి నెలలో సెలవు మీద ఇంటికి వచ్చాడు. మార్చి మొదటి వారంలో అతను అనుకోకుండా అదృశ్యమయ్యాడు. రెండు రోజుల తరువాత ఊరి చివర శ్మశానికి సమీపంలో అతని శవం గుర్తు పట్టలేని స్థితిలో లభించింది. ఈ కేసులో కుటుంబ సభ్యులు కూడా ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయలేదు. దీంతో పోలీసులకు ఈ హత్య కేసు ఒక మిస్టరీగా మారింది...

దుబాయ్ నుంచి వచ్చిన యువకుడి హత్య.. 3 నెలలుగా హంతకుడెవరో తెలియక తలలుపట్టుకున్న పోలీసులు.. ఇంతలో..

దుబాయ్‌ దేశానికి ఉద్యోగ రీత్యా వెళ్లిన ఒక యువకుడు గత ఫిబ్రవరి నెలలో సెలవు మీద ఇంటికి వచ్చాడు. మార్చి మొదటి వారంలో అతను అనుకోకుండా అదృశ్యమయ్యాడు. రెండు రోజుల తరువాత ఊరి చివర శ్మశానికి సమీపంలో అతని శవం గుర్తు పట్టలేని స్థితిలో లభించింది. ఈ కేసులో కుటుంబ సభ్యులు కూడా ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయలేదు. దీంతో పోలీసులకు ఈ హత్య కేసు ఒక మిస్టరీగా మారింది. గత మూడు నెలలుగా పోలీసులు ఈ కేసులో ఎంత వెతికినా ఎటువంటి ఆధారం లభించలేదు. అలాంటిది రెండు రోజుల క్రితం అనుకోకుండా ఒక వ్యక్తిపై పోలీసులకు అనుమానం కలిగింది. 


వివరాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రంలోని యమునా నగర్ ప్రాంతానికి చెందిన పవన్ సింగ్ అనే యువకుడు దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే గత ఫిబ్రవరి నెలలో పవన్ ఇంటికి వచ్చాడు. అతను ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలని పనులు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణ పనులకు కావాల్సిన సామాగ్రి కోసం మార్చి 6న ఇంటి నుంచి బయలు దేరాడు. ఆ తరువాత ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతను కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తరువాత ఊరి చివర శ్మశానానికి సమీపంలో ఒక శవం దొరికింది. ఆ మృతదేహం యొక్క ముఖం గాయాలతో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. దీంతో ఆ శవం పవన్ సింగ్‌దేనని తెలియడానికి కాస్త సమయం పట్టింది. 


పవన్ సింగ్ హత్య కేసులో విచారణ మొదలుపెట్టిన పోలీసులకు ఎటువంటి ఆధారం లభించలేదు. కుటుంబ సభ్యులు కూడా ఎవరిపైనా అనుమానం వ్యక్త పరచలేదు. పోలీసులు ఈ హత్య  ఎవరో దోపిడీదారులు చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేశారు. కానీ ఫలితం దక్కలేదు. దీంతో పవన్ హత్య కేసులో కుటుంబ సభ్యులపై అనుమానం అందరి గురించి వివరాలు సేకరించగా.. ఒకరిపై అనుమానం వచ్చింది. అతనే ఇంట్లో పని చేసే నంద్ కిషోర్. కొద్ది రోజులుగా నంద్ కిషోర్ ఫోన్ స్విచాఫ్ వస్తోంది. దీంతో పోలీసులు అతని గురించి సమాచారం సేకరించారు.


నంద్ కిషోర్ ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందినవాడు. అతను పవన్ సింగ్ ఇంట్లో గత కొంతకాలంగా పని చేస్తున్నాడు. నంద్ కిషోర్ ఇటీవల ఝార్ఖండ్‌లోని తన గ్రామానికి వచ్చాడు. ఆ సమయంలో పోలీసులు అతడిని అరెస్టు చేసి.. ప్రశ్నించగా.. ఒక రహస్యం బయటపడింది. 


పవన్ సింగ్ భార్య.. నంద్ కిషోర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త దుబాయ్‌లో ఉండడంతో ఆమె తన కోరికలు తీర్చుకునేందుకు నంద్ కిషోర్‌ని ప్రేమించింది. కానీ పవన్ సింగ్ ఇటీవల ఇంటికి వచ్చినప్పుడు నంద్ కిషోర్ తరుచూ తన భార్య చుట్టూ తిరగడం చూసి కోపడ్డాడు. అతడిని పొలం పనులు చేయాలని ఇంటి వద్దకు రాకూడదని చెప్పాడు. దీంతో నంద్ కిషోర్ తన ప్రేయసితో కలిసేందుకు పవన్ సింగ్ అడ్డుగా మారాడు. 


ఒకరోజు పవన్ సింగ్ పనిమీద ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు.. నంద్ కిషోర్ అతడిని వెంబడించాడు. పవన్ తనకోసం కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఊరి చివర ఇసుక కోసం వెళ్లాడు. మార్గమధ్యంలో ఒక నిర్మానుషమైన ప్రదేశంలో నంద్ కిషోర్.. పవన్ సింగ్‌ని ఆపి తన వద్ద ఉన్న గొడ్డలితో దాడి చేశాడు. దీంతో పవన్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తరువాత నంద్ కిషోర్.. మృతుడి ముఖాన్ని ఛిద్రం చేసి శ్మశానానికి సమీపంలో పారవేశాడు.


పవన్ సింగ్‌ని తానే హత్య చేసినట్లు నంద్ కిషోర్ పోలీసుల ఎదుట ఒప్పుకన్నాడు. పోలీసులు అతడిని ప్రస్తుతం రిమాండ్‌కు తరలించారు.


Updated Date - 2022-06-03T09:31:17+05:30 IST