500కేజీల గంజాయి సీజ్ .. నిత్యావసరం కాదంటూ పోలీసుల ట్వీట్!

ABN , First Publish Date - 2020-07-18T04:49:32+05:30 IST

నిత్యావసరాలతో వస్తున్న ఓ ట్రక్కును ఆపిన పోలీసులకు దిమ్మతిరిగిపోయింది.

500కేజీల గంజాయి సీజ్ .. నిత్యావసరం కాదంటూ పోలీసుల ట్వీట్!

షిల్లాంగ్: నిత్యావసరాలతో వస్తున్న ఓ ట్రక్కును ఆపిన పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. ఎందుంటే నిత్యావసరాల పేరిట ఆ ట్రక్కులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. అదీ ఒకటో రెండో కాదు ఏకంగా 500కేజీలు. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రం మేఘాలయలోని రిభోయ్ జిల్లాలో జరిగింది. ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసు శాఖ జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘కరోనా సమయంలో నిత్యావసరాల రవాణాకు అనుమతులు ఉన్నాయి. కానీ వాటిలో గంజాయి లేదనే విషయాన్ని మేం గుర్తుచేయాలని అనుకుంటున్నాం. ముక్కుసూటిగా చెప్తున్నందుకు క్షమించాలి. కానీ మేము అలానే పనిచేస్తాం’ అని పోలీసు డిపార్ట్‌మెంట్ రాసుకొచ్చింది. ఈ కామెంట్‌‌తోపాటు స్వాధీనం చేసుకున్న గంజాయి చిత్రాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Updated Date - 2020-07-18T04:49:32+05:30 IST