పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచాలి

ABN , First Publish Date - 2022-05-22T05:48:45+05:30 IST

పోలీసులు ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వ్యాయామాన్ని తమ దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ఐజీ, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి అధికారులు, సిబ్బందికి సూచించారు.

పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచాలి
పరేడ్‌ డ్రిల్‌ను పరిశీలిస్తున్న సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

- సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

కోల్‌సిటీ, మే 21: పోలీసులు ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వ్యాయామాన్ని తమ దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ఐజీ, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి అధికారులు, సిబ్బందికి సూచించారు. శనివారం కమిషనరేట్‌ హెడ్‌క్వార్టర్‌లో గోదావరిఖని సబ్‌ డివిజన్‌ సివిల్‌, ఏఆర్‌ సిబ్బందికి వీక్లీ పరేడ్‌ నిర్వహించారు. సీపీ చంద్రశేఖర్‌రెడ్డి హాజరై గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆర్మ్స్‌ డ్రిల్‌, ఫుట్‌ డ్రిల్‌, లాఠీ డ్రిల్‌, ట్రాఫిక్‌ డ్రిల్‌, సెర్మోనల్‌ డ్రిల్‌లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల అనారోగ్య కారణాలు, రోడ్డు ప్రమాదాలతో సిబ్బంది మరణించారన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఉదయం అరగంట యోగ, ధ్యానం, నడక ఏదో ఒకటి చేయాలన్నారు.  వీక్లీ పరేడ్‌ వల్ల క్రమశిక్షణ, యూనిటీగా ఉండడం, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కు ఉపయోగపడుతుందన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, కారులో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్‌ ధరించాలని సిబ్బందికి సూచించారు. పరేడ్‌లో ఏసీపీ గిరి ప్రసాద్‌, ఏఆర్‌ ఏసీపీ సుందర్‌రావు, ఆర్‌ఐలు మధుకర్‌, శ్రీధర్‌, విష్ణు ప్రసాద్‌, గోదావరిఖని వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌బాబు, రాజ్‌కుమార్‌, టుటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, ట్రాఫిక్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-22T05:48:45+05:30 IST