Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 24 Sep 2022 00:02:15 IST

పోలీసులు అంకితభావంతో సేవలందించాలి

twitter-iconwatsapp-iconfb-icon
పోలీసులు అంకితభావంతో సేవలందించాలిరివార్డు అందుకుంటున్న హెడ్‌కానిస్టేబుల్‌ చంద్రమౌళి

- రామగుండం పోలీస్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి

కోల్‌సిటీ, సెప్టెంబరు 23: విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ ప్రజల కోసం అంకిత భావంతో పనిచేయాలని, ప్రజ లకు సేవలందించడానికి ఎళ్లవేళలా అందుబాటులో ఉండాలని రామగుం డం పోలీస్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి అధికారులు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం కమిషనరేట్‌ కార్యాలయం లో కమిషనరేట్‌ పరిధిలో ఫంక్షనల్‌ వర్టికల్‌ వారీగా విధి నిర్వహణలో ప్రతిభకనబరిచిన పోలీస్‌ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రతినెల విధి నిర్వహణలో ప్రతిభ కన బరిచే అధికారులు, సిబ్బందిని గుర్తిం చి కేపీఐ రివార్డ్స్‌ ఇవ్వడం జరుగుతుం దన్నారు. ప్రతి ఒక్కరూ ఫంక్షనల్‌ వర్టికల్‌ వారీగా పోటీపడి విధులు నిర్వహించి రివార్డులు, అవార్డులు పొందాలని సూ చించారు. కష్టపడి పనిచేసే వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌డాటా నమోదు పరిచిన విధంగా సీసీటీఎన్‌ఎస్‌ టీఎస్‌ కాప్‌ ఆధారంగా వారి పనితనాన్ని బట్టి పూర్తి పారదర్శకంగా అవార్డులు, రివార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలకు మరింత వేగవంతమైన, నా ణ్యమైన సేవలందించే ప్రయత్నం చేస్తూ మరింత బాధ్య తాయుతంగా పనిచేయాలన్నారు.

కేపీఐ రివార్డులు అందుకున్న వారి వివరాలు

కరుణాకర్‌(వర్టికల్‌ లైజనింగ్‌ ఆఫీసర్‌), కే రాజేష్‌(ఎస్‌ఐ, ఇన్వెస్టిగేషన్‌ఆఫీసర్‌), ఎండీ తహసినోద్దీన్‌(ఎస్‌ఐ, మంచి ర్యాల సెక్టార్‌ ఎస్‌ఐ), కళ్యాణి, నస్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ (రిసె ప్షన్‌), కే సంతోష్‌ కుమార్‌(బ్లూక్లోట్స్‌), చంద్రమౌళి, గోదావ రిఖని వన్‌టౌన్‌ (సెక్షన్‌ ఇన్‌చార్జి), బీ రవి, స్టేషన్‌ రైటర్‌, కిరణ్‌ కుమార్‌, సీడీఓ కోర్టు, రాము, శ్రీనివాస్‌(టెక్‌ టీమ్‌), కే వెంకటేశ్వర్లు(ట్రాఫిక్‌ వర్టికల్‌), సీహెచ్‌ దేవరాజ్‌ (సమ న్స్‌), డీ రమేష్‌(వారెంట్‌), ఏ రాజేందర్‌(సైబర్‌క్రైమ్‌), ఎం చంద్రశేఖర్‌(కమ్యూనిటీపోలీసింగ్‌), ఏ రాజేందర్‌(ఏఎస్‌ ఐ, పెట్రోకార్‌), ఎం రవీందర్‌(ఐటీ కోర్‌), పీసీ రవి(ఎంసీ డ్యూటీ) మొత్తం 18మంది పోలీస్‌ అధికారులు, సిబ్బందికి రివార్డులు అందించారు. డీసీపీ(అడ్మిన్‌) అఖిల్‌ మహాజన్‌, ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌, సీసీ శ్రావణ్‌ పాల్గొన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.