ఎంపీ రఘురామరాజు విషయంలో పోలీసులు చట్టబద్దంగా నడుచుకోవాలి: High Court

ABN , First Publish Date - 2022-07-02T00:52:35+05:30 IST

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటీషన్‌‌పై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూలై 4వ తేదీన ప్రధాని మోదీ భీమవరం పర్యటనలో తనకు రక్షణ కల్పించాలని ఎంపీ లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఎంపీ రఘురామరాజు విషయంలో పోలీసులు చట్టబద్దంగా నడుచుకోవాలి: High Court

అమరావతి:  నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటీషన్‌‌పై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూలై 4వ తేదీన ప్రధాని మోదీ భీమవరం పర్యటనలో తనకు రక్షణ కల్పించాలని ఎంపీ లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. రఘురామరాజు తరుపున న్యాయవాది ఉమేష్‌చంద్ర వాదనలు వినిపించారు. రఘురామరాజును కేసులు పెట్టి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే కేంద్రం రఘురామరాజుకు వై క్యాటగిరి భద్రత కల్పించిన విషయాన్నిగుర్తుచేశారు. జూలై 3, 4 తేదీల్లో ఒకవేళ పోలీసులు రఘురామపై కేసులు నమోదు చేస్తే..న్యాయ, చట్టబద్ద ప్రక్రియను అనుసరించాలని కోర్టు ఆదేశించింది. కేసులు పెట్టి వెంటనే అరెస్ట్‌ చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది.  

Updated Date - 2022-07-02T00:52:35+05:30 IST