బాధితుల చెంతకు పోలీసు సేవలు : ఎస్పీ

ABN , First Publish Date - 2022-05-24T05:34:47+05:30 IST

జిల్లా పోలీసు కార్యాలయానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో నెలకోసారి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి పోలీసు సేవలను బాధితుల వద్దకు తీసుకెళతామని ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు.

బాధితుల చెంతకు పోలీసు సేవలు : ఎస్పీ
అర్జీలు స్వీకరిస్తున్న ఎస్పీ పరమేశ్వరరెడ్డి

గూడూరు, మే 23 : జిల్లా పోలీసు కార్యాలయానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో నెలకోసారి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి పోలీసు సేవలను బాధితుల వద్దకు తీసుకెళతామని ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. గూడూరు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో  సోమవారం ప్రత్యేక స్పందన కార్యక్రమం చేపట్టామన్నారు.డివిజన్‌లోని పలువురి నుంచి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి ప్రాంతాల నుంచి ప్రజలు తిరుపతికి వచ్చి ఫిర్యాదులు నేరుగా అందజేయాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుందనే గూడూరులో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.ఫిర్యాదుదారులకు భోజన సదుపాయం కూడా కల్పించామన్నారు.ఈ సందర్భంగా  వెంకటగిరికి చెందిన ఒక వృద్ధుడు తన చిన్నకొడుకు ఆస్తి తీసుకుని ఇబ్బంది పెడుతున్నాడని  ఫిర్యాదు చేశారు.చిల్లకూరు మండలం బూదనం గ్రామానికి చెందిన మహిళా సర్పంచు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గ్రామంలో రౌడీయిజం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని  ఫిర్యాదు చేశారు. వెంటనే విచారించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు ఎస్పీ   సూచించారు.డీఎస్పీ రాజగోపాలరెడ్డి, సీఐలు నాగేశ్వరమ్మ, శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐలు పవన్‌కుమార్‌, తిరుపతయ్య, గోపాల్‌, సుధాకర రెడ్డి, బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T05:34:47+05:30 IST