Jubilee Hills మైనర్ రేప్ కేసులో పోలీసుల సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2022-06-09T17:17:01+05:30 IST

జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Jubilee Hills మైనర్ రేప్ కేసులో పోలీసుల సంచలన నిర్ణయం

హైదరాబాద్: జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేప్ కేస్ నిందితులను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డ్‌ (Juvenile Justice Board‌)ను పోలీసులు కోరారు.  ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తరువాత ట్రయల్ జరిగే సమయంలో ఐదుగురిని అడల్ట్‌లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్‌కు హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. పోలీసుల విజ్ఞప్తిపై జువైనల్ జస్టిస్ దే తుది నిర్ణయం. మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడనికి వారికి ఉన్న సామర్థ్యం అన్నింటినీ పరిగణలోకి తీసుకుని జువైనల్ జస్టిస్ నిర్ణయాన్ని వెల్లడించనుంది. కాగా... మైనర్లకు 21 యేళ్లు దాటిన తరువాత వారిని జువైనల్‌ హోం నుంచి సాధారణ జైల్‌కు తరలిస్తారన్న విషయం తెలిసిందే.


జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసు దర్యాప్తును పోలీసులు కీలకంగా తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అనేక ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ నేపథ్యంలోనే కేసులో పట్టుబడ్డ నలుగురు మైనర్లే అని... వీరిపై సెక్లన్లను పూర్తిగా అమలు చేసేందుకు మేజర్లుగా పరిగణించాల్సి ఉంటుందని జువైనల్ బోర్డుకు పోలీసులు తెలియజేశారు. చార్జ్‌షీట్ దాఖలు సమయానికి నిందితులంతా మేజర్లు అవుతారని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారించి, శిక్షలు పడేలా చేయాలంటే నిందితులను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ బోర్డుకు పోలీసులు లేఖ రాశారు. ఈ వ్యవహారంపై జువైనల్ బోర్డు నిర్ణయం కీలకంగా మారింది. 


మరోవైపు... ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు చంచల్ గూడా జైలుకు జూబ్లీహిల్స్ పోలీసులు చేరుకున్నారు. ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 4 రోజుల పాటు నిందితుని  పోలీసులు విచారించనున్నారు. కాగా... ఇదే ఘటనకు సంబంధించి జువైనల్‌ హోంలో ఉన్న మరో ఐదుగురు మైనర్లను కూడా విచారిస్తామని, కోర్టు అనుమతికోసం ఎదురు చూస్తున్నామని ఏసీపీ తెలిపారు. 

Updated Date - 2022-06-09T17:17:01+05:30 IST