ఆ రసగుల్లలను అందుకే సీజ్ చేశాం: పోలీసులు

ABN , First Publish Date - 2021-05-07T00:34:27+05:30 IST

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికలను కూడా ఎన్నికల సంఘం నిర్వహించింది. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో పోలీసులు 20 కేజీల రసగుల్లలను స్వాధీనం..

ఆ రసగుల్లలను అందుకే సీజ్ చేశాం: పోలీసులు

లక్నో: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికలను కూడా ఎన్నికల సంఘం నిర్వహించింది. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో పోలీసులు 20 కేజీల రసగుల్లలను స్వాధీనం చేసుకున్నారు. ఆశ్చర్యపోకండి.. కరోనా నేపథ్యంలో ఎన్నికల ఫలితాల అనంతరం ఎవరూ విజయోత్సవాలు చేసుకోకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 144ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆ నిబంధనలను అతిక్రమించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. యూపీలోని హాపుర్ పంచాయతీలో విజయం సాధించిన అభ్యర్థి తరపున ఇద్దరు వ్యక్తులు సంబరాలు చేసుకుంటూ రసగుల్లలను పంచుతూ తిరిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి వారి నుంచి దాదాపు 20 కేజీల రసగుల్లలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-05-07T00:34:27+05:30 IST