Abn logo
Sep 23 2021 @ 23:50PM

గ్రానైట్‌ను సీజ్‌ చేసిన పోలీసులు

గ్రానైట్‌ను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు సీజ్‌ చేసిన వాహనం

రామాపురం, సెప్టెంబరు23: మండలంలో అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్‌ను కొత్తరోడ్డు నారాయణపురం చెక్‌పోస్టు వద్ద సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ జయరాములు తెలిపారు. చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పికప్‌ వాహనంలో గ్రానైట్‌ రాయిని తరలించడం కనిపించిందన్నారు. తగిన ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నా రు. సీజ్‌ చేసిన వాహనాన్ని మైనింగ్‌ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు.