Abn logo
Jun 16 2021 @ 21:17PM

గ్లైపోసెట్ ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్‌: నకిలీ పత్తి విత్తనాలు, నిషేధిత గ్లైపోసెట్ పురుగుల మందును అమ్ముతున్న ముఠా గుట్టును శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు రట్టు చేసారు. ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో‌ ఉన్నాడు. 400 ప్యాకెట్ల నకిలీ బీజీ-3 హెచ్‌టీ, 40  కేజీల విడి విత్తనాలు, 242 లీటర్ల గ్లైపోసెట్ పురుగుల మందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దివ్యా ట్రేడర్స్, శ్రీ సాయి తేజా ఫర్టిలైజర్స్, శ్రీ సాయి ఫర్టిలైజర్స్ షాపుల కేంద్రంగా అక్రమ అమ్మకాలు సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న విత్తనాల‌ విలువ ఐదు లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నకిలీ విత్తనాల గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి చేశారు. 

క్రైమ్ మరిన్ని...