ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసుల బందోబస్తు

ABN , First Publish Date - 2022-05-18T04:34:13+05:30 IST

లైంగికంగా వేధిస్తు న్నాడని కోడలు మామను చంపిన కేసులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీస్‌ యంత్రాంగం జిల్లా ప్రభుత్వ ఆసు పత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసుల బందోబస్తు
మార్చురీ వద్ద కుటుంబ సభ్యులు, వాల్మీకి సంఘం నాయకులతో మాట్లాడుతున్న డీఎస్పీ


వనపర్తి క్రైమ్‌, మే 17: లైంగికంగా వేధిస్తు న్నాడని కోడలు మామను చంపిన కేసులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీస్‌ యంత్రాంగం జిల్లా ప్రభుత్వ ఆసు పత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పలువురు వ్యక్తులు సోషల్‌ మీడియాలో లాకప్‌ డెత్‌తో చనిపోయారనే పుకార్లు సృష్టించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘటన లకు తావివ్వకుండా ముందస్తుగా సీఐ ప్రవీణ్‌కు మార్‌ ఆధ్వర్యంలో వనపర్తి టౌన్‌ ఎస్‌ఐలు యు గంధర్‌రెడ్డి, శివకుమార్‌, ఘణపురం ఎస్‌ఐ వెంక టేష్‌గౌడ్‌, గోపాల్‌పేట ఎస్‌ఐ నవీద్‌, వనపర్తి రూ రల్‌ ఎస్‌ఐ చంద్రమోహన్‌రావు, పోలీస్‌ సిబ్బంది తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొహరిం చారు. పలువురు సోషల్‌ మీడియాలో వచ్చిన పో స్టులు చూసి అక్కడికి వచ్చిన వాల్మీకి సంఘం నాయకులకు పోలీసులు జరిగిన ఘటనపై వివ రణ ఇవ్వడంతో వాళ్లు అక్కడి నుంచి వెనుదిరి గారు. కోడల్ని మామ లైంగికంగా వేధించడంతోనే ఈ ఘటన జరిగిందని, పోలీస్‌ లాకప్‌డెత్‌ అనేది కొందరు వ్యక్తులు చేసిన పుకార్లేనని సీఐ ప్రవీణ్‌ కుమార్‌ వారికి చెప్పడంతో అక్కడినుంచి వెళ్లిపో యారు. దీంతో ఎలాంటి ఘటనలకు తావివ్వకుం డా కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని అప్పజెప్పారు. అంతకుముం దు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డీఎస్పీ నరేందర్‌రెడ్డి మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సోషల్‌ మీడియాలో పుకార్లు పు ట్టిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐ ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరించారు. 

Updated Date - 2022-05-18T04:34:13+05:30 IST