ముంబై: టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరలయింది. దాన్ని కోహ్లీ భార్య, స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ తీసింది. ఆ వీడియోలో కోహ్లీ డైనోసార్‌లా నటించాడు. ఈ వీడియోకు నాగ్‌పూర్ పోలీసులు హిలేరియస్‌గా రిప్లై ఇచ్చారు. అది చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు. ఇంతకీ వారు ఏమని రిప్లై ఇచ్చారో తెలుసా? ‘మహారాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడి రెస్క్యూ టీంను పంపమంటారా?’ అని బదులిచ్చారు. దాన్ని చూసిన నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. నాగ్‌పూర్ పోలీసుల చమత్కారాన్ని కొనియాడుతున్నారు.