Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాన్‌షాప్‌లపై పోలీసుల దాడులు

హైదరాబాద్: నగరంలోని పలు పాన్‌షాప్‌లపై పోలీసులు విస్తృతంగా దాడులు చేశారు. వనస్థలిపురం కాంప్లెక్స్‌లోని పాన్‌షాప్‌లపై పోలీసుల ముమ్మరంగా దాడులు నిర్వహించారు. నిన్న రాత్రి  ఈ కాంప్లెక్స్‌లో గంజాయి సేవించి యువకులు వీరంగం సృష్టించి కొట్టుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేశారు. గంజాయి, డ్రగ్స్ సేవించడం వలనే ఇలాంటి కొట్టుకునే ఘటనలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ పాన్‌షాప్‌లలో గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నారనే ఆరోపణలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి.


ఈ ఘటన నేపథ్యంలో కాంప్లెక్స్‌లో ఉన్న ఆరు పాన్‌షాప్‌లపై  పోలీసులు దాడులు చేశారు. నాలుగు షాప్‌లలో గంజాయి తాగడానికి ఉపయోగించే పేపర్‌ను భారీగా స్వాధీనం చేసుకున్నారు. పేపర్‌ను పోలీసులు పోలీస్ స్టేషన్‌కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

రాత్రి సమయాల్లో వనస్థలిపురంలోని కాంప్లెక్స్ వద్ద యువకులు గ్రూపులుగా విడిపోయి రోడ్లపై తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయి. ఒకరిపై ఒకరు దాడులు సైతం చేసుకుంటున్నారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. దీంతో  వనస్థలిపురం పోలీసులు  స్పందించారు. కాంప్లెక్స్ పరిసరాలలో ఉన్న పాన్  షాపులలో నిషేధిత గుట్కా, గంజాయ్ వంటివి ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో తనిఖీలు చేపట్టారు.

Advertisement
Advertisement