Advertisement
Advertisement
Abn logo
Advertisement

హాండ్సప్! అంటూ ఇంట్లోకి దూసుకొచ్చిన పోలీసులు.. చంటి పిల్లాడితో ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళ.. చివరికి పోలీసులు ఏం చేశారంటే..

నేరుస్తులను పట్టుకోవడానికి పోలీసులు ఎంత కష్టాలు పడుతూ ఉంటారో మనం సినిమాలలో చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆ ప్రయత్నాలలో పోలీసులు కూడా అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు. 


అమాయకులను కూడా తమ అనుమానంతో హింసిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరినీ అనుమానించడం వారి వృత్తిలో భాగం.. అందుకు వారిని కూడ తప్పుపట్టలేం. కానీ ఈ క్రమంలో మరీ చంటి పిల్లాడితో ఒంటరిగా ఉన్న మహిళని అనుమానించి బెదిరించడం కూడా సరికాదు. అవును ఇది నిజంగానే జరిగింది. అది కూడా భారత్‌లో కాదు మానవ హక్కుల గురించి నిరంతరం మాట్లాడే అమెరికాలాంటి దేశంలో. అసలేం జరిగిందంటే..


అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో ఇటీవల ఒక నేరస్తుడు.. పోలీసుల చెర నుంచి తప్పించుకొని పారిపోయాడు. అతడు ఒక ప్రాంతంలో దాగి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. 


వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలోని ఒక బిల్డింగ్‌లో అతను ఫలానా ఫ్లాట్‌లో ఉన్నాడని ఇన్‌ఫర్మీషన్. అతను ఒక ప్రమాదకర నేరస్తుడు కావడంతో.. పోలీసులు తమ వద్ద ఉన్న తుపాకులతో ఒక్కసారిగా ఆ ఫ్లాట్‌ డోర్ పగుల కొట్టి లోపలికి దూసుకొచ్చారు.


ఆ ఇంట్లో 22 ఏళ్ల ఒక మహిళ తన చంటి బిడ్డకు పాలు పట్టిస్తూ కూర్చొని ఉంది. పోలీసులు ఒక్కసారిగా అలా వచ్చేసరికి ఆమె భయపడిపోయింది. ఆమెను ఆ స్థితిలో పోలీసులు గన్‌పాయింట్‌పై బెదిరించారు. "ఆ నేరస్తుడు ఎక్కడ?.. త్వరగా చెప్పు.. వాడు ఇక్కడే ఉన్నాడని మాకు తెలుసు" అని గట్టిగా అరిచారు. వాళ్ల అరపులకు ఆ చంటి పిల్లాడు ఏడ్చేశాడు. ఆమెకు చెమటలు పట్టాయి. ఏం చేయాలో తోచలేదు. 


ఆమెను పోలీసులు చుట్టుముట్టారు, ఇల్లంతా హడావుడి చేస్తూ వస్తువులన్నీ విసిరేస్తున్నారు. అదంతా చూసి ఆమె వణికిపోయింది. అప్పుడే వారికి ఫోన్ వచ్చింది. వారు తప్పుడు అడ్రస్‌కు వెళ్లారని తెలిసింది. ఆ ఫోన్ రాగానే పోలీసులు తెల్ల ముఖం వేశారు. వెంటనే ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అసలు అక్కడ ఏం జరిగిందో ఆ మహిళకు అర్థం కాలేదు.


కొన్ని గంటలు గడిచాక, ఇద్దరు పోలీసులు ఆమె వద్దకు మళ్లీ వచ్చి తాము ఒక ప్రమాదకర హంతకుడిని వెతుకుతూ పొరపాటున అక్కడికి వచ్చామని చెప్పి విషయం వివరించారు. ఈ ఘటన ఇటీవలే జరిగింది. ఆ ఇంట్లో ఉన్న సీసీటీవి వీడియోలో పోలీసులు చేసిన వీరంగం అంతా రికార్డ్ అయింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement