Delhi:మారు వేషాల్లో వచ్చిన పోలీసులు...దొంగల్ని ఇలా పట్టేశారు

ABN , First Publish Date - 2021-09-29T18:08:54+05:30 IST

అచ్చు సినిమాల్లో లాగా దొంగలను పట్టుకోవడం కోసం పోలీసులు మారు వేషాల్లో వచ్చి, నిందితుల చేతులకు బేడీలు వేసిన ఉదంతం...

Delhi:మారు వేషాల్లో వచ్చిన పోలీసులు...దొంగల్ని ఇలా పట్టేశారు

న్యూఢిల్లీ : అచ్చు సినిమాల్లో లాగా దొంగలను పట్టుకోవడం కోసం పోలీసులు మారు వేషాల్లో వచ్చి, నిందితుల చేతులకు బేడీలు వేసిన ఉదంతం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో తాజాగా వెలుగుచూసింది. ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో మల్జీత్ కౌర్ అనే మహిళ ఇంట్లో ఈ నెల 18వతేదీన గుర్తుతెలియని దొంగలు చోరీ చేశారు.తాను భర్తతో కలిసి ఆఫీసుకు వెళ్లినపుడు తన ఇంట్లో దొంగతనం జరిగిందని మల్జీత్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా నలుగురు దొంగలు ఓ బ్యాగుతో వెళ్లినట్లు గుర్తించారు. దొంగిలించిన బ్యాగ్ ను బాధితురాలు గుర్తించారు.


 ఆటో డ్రైవరును కనిపెట్టిన పోలీసులు అతన్ని ప్రశ్నించగా నలుగురు దొంగలు చోరీ అనంతరం ఆటోలో మెహ్రౌలి ప్రాంతానికి వెళ్లారని తేలింది. జనసాంద్రత అధికంగా ఉన్న మెహ్రౌలి ప్రాంతంలో పోలీసులు మున్సిపల్ ఉద్యోగుల్లా మారువేషంలో వచ్చి ఇళ్లలో సోదాలు చేశారు.పోలీసులు మున్సిపల్ ఉద్యోగుల్లా మారువేషాల్లో వచ్చి సోదాలు చేసి దొంగలను పట్టుకున్న ఉదంతం సంచలనం రేపింది. 


ఈ సోదాల్లో నిందితులు నితిన్ కుమార్, అనూప్ కుమార్, మహ్మద్ ఇర్ఫాన్, అశుకుమార్ లను పోలీసులు పట్టుకున్నారు. చోరీ సొత్తు కొన్న బిదేశ్ హల్దర్ ను గుర్తించి అతని వద్ద నుంచి బంగారు కంకణాలు, బంగారు గొలుసు, నాలుగుజతల వెండి పట్టీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


Updated Date - 2021-09-29T18:08:54+05:30 IST