పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

ABN , First Publish Date - 2021-10-29T05:03:09+05:30 IST

ఆరోగ్యమే మహాభాగ్యమని, పోలీస్‌ సిబ్బంది తమ ఆరో గ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ మలికగర్గ్‌ కోరా రు. పోలీస్‌ అమరవీరుల వారోత్సవాల్లో భాగం గా గురువారం ఒంగోలులోని పోలీసుకల్యాణ మండపంలో పోలీస్‌ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబి రాన్ని ఎస్పీ ప్రారంభించారు.

పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
వైద్యశిబిరంలో పరీక్ష చేయించుకుంటున్న ఎస్పీ మల్లికగర్‌

ఒంగోలు(జడ్పీ), అక్టోబరు 28: ఆరోగ్యమే మహాభాగ్యమని, పోలీస్‌ సిబ్బంది తమ ఆరో గ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ మలికగర్గ్‌ కోరా రు. పోలీస్‌ అమరవీరుల వారోత్సవాల్లో భాగం గా గురువారం ఒంగోలులోని పోలీసుకల్యాణ మండపంలో పోలీస్‌ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబి రాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్‌ అమరవీరుల ను స్మరించుకుంటూ ప్రతి ఏడాది సంస్మరణ వారోత్సవాలు చేపడుతున్నట్లు చెప్పారు. కరోనా సమయంలో 10మంది పోలీస్‌ సిబ్బంది విధు లు నిర్వర్తిస్తూ వైరస్‌ సోకి అశువులు బాశారని వారి వృత్తి నిబద్ధతను కొనియాడారు. పోలీసుల కు ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే వైద్యపరీక్ష లు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. ఈ సందర్భంగా పోలీస్‌ యూనిట్‌ డా క్టర్‌ భానుమతి, వైద్యులు జి.సుధాకర్‌, బ్రహ్మే శ్వరరావు, మూర్తి వైద్యపరీక్షలు చేసి మందులు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ బి.రవిచం ద్ర, ఓఎస్‌డీ కె.చౌడేశ్వరి, డీఎస్‌బీ డీఎస్పీ బి.మ రియదాసు, ట్రాఫిక్‌ డీఎస్పీ మల్లికార్జునరావు,   సీఐ ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు


Updated Date - 2021-10-29T05:03:09+05:30 IST