Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీ నేత గుండెలపై బూటుకాలుతో తన్నిన పోలీసులు.. పరిస్థితి విషమం

నరసరావుపేట: నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలపై పోలీసులు జూలుం ప్రదర్శించారు. నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్ బాబు గుండెలపై పోలీసులు బూటుకాలుతో తన్నారు. బూటుకాలుతో తన్నడంతో ఆయన సృహతప్పి పడిపోయారు. వెంటనే అరవింద్ బాబును నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి తరలించారు. ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది. అరవింద్‌బాబును ఆస్పత్రికి తరలించిన అంబులెన్స్‌పై వైసీపీ శ్రేణుల దాడికి దిగారు. అంబులెన్స్ అద్దాలు ధ్వంసం చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు, టీడీపీ కార్యకర్తల మద్య తోపులాట జరిగింది. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు దాడి దిగారు. పోలీసుల దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement