బాలికల బట్టలు విప్పి..నృత్యం చేయించి..

ABN , First Publish Date - 2021-03-04T07:24:35+05:30 IST

ఆ బాలికల హాస్టల్‌లోకి కొందరు మగవాళ్లు ప్రవేశించారు. వారిలో పోలీసులూ ఉన్నారు. కొందరు బాలికలతో బలవంతంగా బట్టలు విప్పించి..

బాలికల బట్టలు విప్పి..నృత్యం చేయించి..

విచారణ పేరుతో హాస్టల్లోకి ప్రవేశించి పోలీసుల దుశ్చర్య


ముంబై, మార్చి 3: ఆ బాలికల హాస్టల్‌లోకి కొందరు మగవాళ్లు ప్రవేశించారు. వారిలో పోలీసులూ ఉన్నారు. కొందరు బాలికలతో బలవంతంగా బట్టలు విప్పించి.. వారితో నగ్నంగా నృత్యం చేయించారు. ఓ కేసు విచారణ పేరుతో మహారాష్ట్రలోని జల్గావ్‌లో పోలీసుల దుర్మార్గం ఇది. దీనికి సంబంధించి ఓ వీడి యో ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రం గా స్పందించింది. విచారణ కోసం నలుగురు సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని నియమిస్తున్నట్లు బుధవారం అసెంబ్లీలో హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రకటించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటన చాలా తీవ్రమైనదని, ప్రభుత్వం అంత సీరియ్‌సగా లేదని అంతకుముందు అసెంబ్లీలో బీజేపీ నేత సుధీర్‌ అసెంబ్లీలో ఆరోపించారు.

Updated Date - 2021-03-04T07:24:35+05:30 IST