సేవకు సత్కారం

ABN , First Publish Date - 2021-04-13T05:19:24+05:30 IST

విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీస్‌ అధికారులు, పోలీసులకు ప్రభుత్వం ఉగాది సేవా పతకాలు ప్రకటించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పతకాలు ప్రకటించారు.

సేవకు సత్కారం

పలువురు పోలీసులకు ఉగాది సేవా పతకాలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీస్‌ అధికారులు, పోలీసులకు ప్రభుత్వం ఉగాది సేవా పతకాలు ప్రకటించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పతకాలు ప్రకటించారు. 

- రాష్ట్ర ఉత్తమ సేవా పతకం జి. అప్పలనాయుడు(రూరల్‌ ఏఎస్సై), కె.శ్రీనివాసరాజు (సిటీ ఏఆర్‌ఎస్సై)కు లభించింది. 

- రాష్ట్ర పోలీస్‌ సేవా పతకాలు ఎస్‌.లక్ష్మణమూర్తి(సీఐ, రూరల్‌), ఆర్‌.దయానిధి (ఎస్పై, సిటీ)తోపాటు రూరల్‌ జిల్లాకు చెందిన ఏఎస్సైలు జి.కుమార్‌బాబు, ఎస్‌.నాగరాజు, కె దుంగ, హెచ్‌సీ పి.శ్రీనివాస్‌, కానిస్టేబుల్‌ బి.రామకృష్ణకు లభించాయి. సిటీకి చెందిన ఎయిర్‌పోర్టు కానిస్టేబుల్‌ జి. జ్ఞానే శ్వర్‌, రిజర్వు ఎస్సై రంగనాయకులు, హెచ్‌సీలు జి.వి.రమణ, నారాయణ, 16వ బెటాలియన్‌కు చెందిన హెచ్‌సీలు బి. సూర్యనారాయణ, ఎస్‌.వి.వి.రావు, బి.అప్పారావు, ఏసీబీ ఎస్సై ఎస్‌.రమేష్‌, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కానిస్టేబుల్‌ కె.సురేంద్రబాబుకు లభించాయి.

- జిల్లా స్థాయిలో ఉత్తమసేవా పతకాలకుగాను విశాఖ సిటీకి చెందిన ఆర్‌ఎస్‌ఐ కె.సత్యనారాయణ, హార్బర్‌ స్టేషన్‌కి చెందిన హెచ్‌సీ ఆర్‌.ఉమామహేశ్వరరావు,  16వ బెటాలియన్‌ ఎస్సె పి.భాస్కరావులకు లభించాయి.

- రూరల్‌ జిల్లాకు చెందిన రిజర్వు ఎస్సైలు ఎం.ఆదినారాయణ, ఎల్‌.శ్రీనివాసరావు, కె.వర ప్రసాద్‌తోపాటు కానిస్టేబుళ్లు ఎల్‌.అప్పారావు, ఎల్‌.సుందర రావు, సిహెచ్‌.సత్యనారాయణకు కఠిన సేవాపతకాలు లభించాయి.

- సేవా పతకానికి రూరల్‌ జిల్లాకు చెందిన ఎస్సై పి.రమణ, హోంగార్డ్సు డీఎస్‌పీ జి,చంద్రబాబు, ఎంపికయ్యారు. ఇంకా హెచ్‌సీలు జి.అప్పన్న, ఎం.శేషాద్రిరావు,  ఈ.ఎన్‌.కొండలరావు, ఎస్సైలు ఆర్‌.త్రినాథరావు, ఆర్‌.ఎస్‌.చార్యులు, ఏఎస్సెలు ఎస్‌.కొండలరావు (వన్‌టౌన్‌),  పి,మురళికృష్ణ (ఏఎస్సై, డబ్ల్యూపీఎస్‌), హెచ్‌సీలు ఎల్‌.మదన్‌, వి.విశ్వేశ్వరరావు (కారు), ఎల్‌.అప్పారావు, విజయకుమార్‌ చౌదరి (16వ బెటాలియన్‌), ఆర్‌.శ్రీనివాసరావు (ఎస్‌పీఎఫ్‌) ఉన్నారు.  


Updated Date - 2021-04-13T05:19:24+05:30 IST