బైక్‌పై వెళుతున్న యువకులను ఆపి చితక్కొట్టిన పోలీసు.. కారణమేంటో తెలిస్తే షాకవడం ఖాయం!

ABN , First Publish Date - 2021-11-22T21:31:16+05:30 IST

ఆదివారం కదా అని ఆ యువకుడు బైక్ తీశాడు.. మరో ఇద్దరు స్నేహితులను తీసుకుని బైక్‌పై బయల్దేరాడు..

బైక్‌పై వెళుతున్న యువకులను ఆపి చితక్కొట్టిన పోలీసు.. కారణమేంటో తెలిస్తే షాకవడం ఖాయం!

ఆదివారం కదా అని ఆ యువకుడు బైక్ తీశాడు.. మరో ఇద్దరు స్నేహితులను తీసుకుని బైక్‌పై బయల్దేరాడు.. ముగ్గురు ప్రయాణిస్తున్నారనే కారణంతో దారిలో ఓ పోలీస్ అధికారి వారిని ఆపాడు.. త్రిబుల్ రైడింగ్ నేరమని చెప్పి రూ.500 అడిగాడు.. ఇవ్వలేదనే కోపంతో వారిపై విరుచుకుపడ్డాడు.. నడి రోడ్డు మీద వారిని కాలితో తన్నాడు.. పిడిగుద్దులు కురిపించాడు.. ఇండోర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


రామేశ్వర్ యాదవ్ అనే యువకుడు తన తండ్రికి ట్రైన్ టికెట్ బుక్ చేసేందుకు స్నేహితులతో కలిసి బైక్‌పై బయల్దేరాడు. దారిలో ఏఎస్‌ఐ పాండే వారిని ఆపాడు. త్రిబుల్ రైడింగ్ చేయడం నేరమని చెప్పి, రూ.500 ఇవ్వమని అడిగాడు. తమ దగ్గర అంత డబ్బు లేదని చెప్పడంతో పాండే ఆగ్రహానికి గురయ్యాడు. రామేశ్వర్‌పై దాడికి పాల్పడ్డాడు. పంచ్‌లు ఇస్తూ, కాలితో తన్నుతూ వీరంగం వేశాడు. స్థానికులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. 


యువకులతో అనుచితంగా ప్రవర్తించిన పోలీస్ అధికారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తుంటే.. వారిని ఆపి జరిమానా విధించాలి గాని, ఇలా రోడ్డు మీద దాడికి పాల్పడడం తప్పని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-11-22T21:31:16+05:30 IST