చేతులెత్తి మొక్కితే.. నెత్తికెక్కుతారు.. పోలీసులతో ఆర్జీవీ

ABN , First Publish Date - 2020-03-26T18:16:59+05:30 IST

లాక్‌డౌన్ పట్టించుకోండంటూ చేతులెత్తి నమస్కరిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో

చేతులెత్తి మొక్కితే.. నెత్తికెక్కుతారు.. పోలీసులతో ఆర్జీవీ

హైదరాబాద్: లాక్‌డౌన్ పాటించాలంటూ.. ఇళ్లకే పరిమితం కావాలంటూ పోలీసులు చేతులెత్తి వేడుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయినా జనం రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ఇష్టారీతిన తిరుగుతూనే ఉన్నారు. అక్కడక్కడా పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నా.. పరిస్థితలో మార్పు రావడం లేదు. లాక్‌డౌన్‌పై పోలీసుల వ్యవహరించాల్సిన తీరుపై సినీ ప్రముఖుడు ఆర్జీవీ ఓ ట్వీట్ చేశారు. చేతులెత్తి మొక్కితే నెత్తినెక్కి కూర్చుంటారంటూ ఓ వీడియోను అప్ లోడ్ చేశారు. లాక్‌డౌన్‌ను అతిక్రమించే వారి పట్ల స్నేహపూర్వకంగా కాదని.. కఠినంగా వ్యవహరించాల్సిందేనంటూ వర్మ తన ట్వీట్ ద్వారా చెప్పకనే చెప్పారు. 



Updated Date - 2020-03-26T18:16:59+05:30 IST